Newspillar
Newspillar
Wednesday, 23 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

యాదాద్రి రిపోర్ట్- తెలంగాణలో ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరి గుట్టలోని యాదాద్రిలో (Yadadri) త్రిదండి చిన్న జీయర్‌స్వామి (Chinna Jeeyar Swamy) ఆశ్రమం ఏర్పాటు కాబోతోంది. యాదాద్రి కొండ కింద ఆశ్రమం ఏర్పాటు కోసం చిన్న  జీయర్‌ స్వామికి మూడెకరాల స్థలాన్ని గతంలో యాదాద్రి టెెంపుల్ డెవలప్మెంట్ అధారిటీ- వైటీడీఏ (YTDA) కేటాయించింది. సోమవారం ఆ స్థలాన్ని చిన్న జీయర్‌ స్వామి పరిశీలించారు. అక్కడ ఆధ్యాత్మికం వెల్లివిరిసేలా ఆశ్రమం ఏర్పాటుకు ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి అనుగునంగా ఇటీవల ఆ స్థలాన్ని చదును చేశారు. ఆశ్రమ నిర్మాణానికి నమూనా సిద్ధం చేసిన తరువాత త్వరలోనే ఆశ్రమానికి సంబందించిన పనులు ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ తో పాటు తిరుమలలో చిన్న జీయర్ స్వామికి ఆశ్రమాలున్నాయి.