Newspillar
Newspillar
Friday, 25 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

స్పెషల్ రిపోర్ట్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు రావడంపై ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. ఈ 69 సంవత్సరాల్లో మొట్టమొదటి సారి తెలుగు ఇండస్ట్రీకి జాతీయ అవార్డ్ రావడం, అదీ తనకు రావడంతో అల్లు అర్జున్ తో పాటు ఆయన కుటుంబం మొత్తం సంతోషంలో మునిగిపోయింది. జాతీయ అవార్డు వచ్చిన నేపధ్యంలో శుక్రవారం రాత్రి అల్లు అర్జున్ నివాసంలో ఓ ప్రైవేట్‌ పార్టీ ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు ఈ పార్టీలో సందడి చేశారు. జాతీయ అవార్డు రావడానికి కారణమైన ‘పుష్ప’ (Pushpa) మూవీ థీమ్‌తో అల్లు అర్జున్ ఇంటిలో పార్టీ జరిగింది.

ఎర్రచందనం దుంగలతో ఉన్న లారీ, గొడ్డలి వంటి ఆకారంలో  డైనింగ్‌ టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. తగ్గేదే లే డైలాగ్‌ ను కూడా ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్‌ (Allu Arjun), డైరెక్టర్ సుకుమార్‌ (Sukumar)  కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప- ది రైజ్‌’ (Pushpa The Rise) బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందించిన ఈ సినమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్‌గా నటించారు. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్‌గా ‘పుష్ప- ది రూల్‌’ రూపొందుతోంది.