Newspillar
Newspillar
Friday, 01 Sep 2023 18:30 pm
Newspillar

Newspillar

వెధర్ రిపోర్ట్- తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. ఆదివారం నుంచి మంగళవారం వరకు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేసింది. శనివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ (IMD) పేర్కొంది. 

ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఆంధ్ర తీరం వరకు ద్రోణి విస్తరించి ఉండటంతో ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో 3న మరో ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నాయని పేర్కొంది. వీటి ప్రభావంతో తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు పడనున్నాయని వాతావరణశాఖ హైదరాబాద్‌ డైరెక్టర్ నాగరత్న (Nagaratna) చెప్పారు. ఇక గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 

కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, కొత్తగూడెం, ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.