Newspillar
Newspillar
Sunday, 03 Sep 2023 00:00 am
Newspillar

Newspillar

స్పెషల్ రిపోర్ట్- అక్కినేని నాగార్జున ()Nagarjuna సినిమాల్లోని సూపర్ హిట్ పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసరం లేదు. అందులోను హలోబ్రదర్ (Hello Brother) సినిమాలోని ప్రియరాగాలే పాట ఎంత ప్రజాధరణ పొందిందో అందరికి తెలుసు. ఇప్పుడు ఈ పాట గురించి చర్చ ఎందుకు అనుకుంటున్నారా ? అసలు విషయం ఏంటంటే.. హైదరాబాద్ లో అన్నపూర్ణ ఫిల్మ్‌ కాలేజీలో జరిగిన ఓ వేడుకలో, నాగార్జున భార్య, నటి అమల (Amala) డ్యాన్స్‌ చేసి అందరిని అలరించారు. నాగార్జున నటించిన హలో బ్రదర్‌ లోని ప్రియ రాగాలే గుండెలోన పొంగె ఈ వేల.. పాటకు అమల స్టెప్పులేశారు. అమల డ్యాన్స్ కు సంబంధించిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అక్కినేని అభిమానులతో పాటు నెటిజన్స్ అమల డ్యాన్స్ కు ఫిదా అవుతున్నారు. మరింకెందుకు ఆలస్యం.. మీరు కూడా అమల స్టెప్పులు చూసేయండి..