Newspillar
Newspillar
Sunday, 03 Sep 2023 18:30 pm
Newspillar

Newspillar

బిగ్ బాస్ రిపోర్ట్- అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) హోస్ట్ గా ప్రముఖ తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్ 7 ప్రారంభమైంది. ఇప్పటివరకూ ఆరు సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని తాజాగా ఏడో సీజన్‌ (Bigg Boss Telugu 7) స్టార్ మా లో మొదలైంది. ఆదివారం సాయంత్రం గ్రాండ్‌ గా లాంచ్‌ ఐన ఈవెంట్‌ లో మొత్తం 14మంది కంటెస్టెంట్‌ లు హౌస్‌ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌ లో భాగంగా పలువురు సినీ తారలు బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చారు. రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) తన తాజా మూవీ ఖుషి (Kushi) ప్రమోషన్ కోసం బిగ్ బాస్ షోకు వచ్చారు. 

బిగ్‌ బాస్‌ సీజన్‌-7 షో లో విజయ్ దేవరకొండ పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. చాలా రోజుల తర్వాత మంచి విజయం దక్కిందని, తాను చాలా రిలీఫ్‌గా ఉన్నానని చెప్పారు. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు విజయ్ దేవరకొండ. ఈ సందర్భంగా మీ హీరోయిన్‌ సమంత (Samantha) ఎక్కడ.. అని అడిగారు నాగార్జున. ఆయన నుంచి ఊహించని ప్రశ్న నుంచి తేరుకున్నాక.. సమంత అమెరికాలో ఉందని చెప్పారు విజయ్ దేవరకొండ.

అమెరికాలో ఖుషి ప్రమోషన్స్‌ తో పాటు, ఆమె హెల్త్‌కు సంబంధించి ట్రీట్‌ మెంట్‌ కు వెళ్లారని తెలిపారు విజయ్. దీంతో.. నువ్వు మంచి నటుడివి.. సామ్‌ కూడా బాగా నటిస్తుంది.. సినిమాలో ఎవరిని ఎవరు డామినేట్‌ చేశారని నాగార్జున ప్రశ్నించగా.. తాను ఆధిపత్యం చూపిద్దామని ప్రయత్నించానని, చివరికి భార్యలే కదా డామినేట్‌ చేసేది.. అని విజయ్ దేవరకొండ చెప్పే సరికి నాగ్ నవ్వేశారు. ఏమాయ చేసావె సినిమా నుంచి సమంత అంటే ఆరాధన భావన ఉందని చెప్పిన విజయ్‌, ఆమెతో కలిసి నటించడం ఒక మంచి అనుభూతి అని అన్నారు.