Newspillar
Newspillar
Wednesday, 06 Sep 2023 18:30 pm
Newspillar

Newspillar

తిరుపతి రిపోర్ట్- కలియుగ దైవం శ్రీ వేంకచేశ్వర స్వామి దర్శనం కోసం మెట్ల మార్గంలో వచ్చే భక్తులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి చిరుతలు. దీంతో అటవీ శాఖ అధికారులతో పాటు టీటీడీ (TTD) అధికారులు ఆపరేషన్ చిరుత (Oparation Leopard) చేపట్టారు. ఈ క్రమంలో తిరుమలలో మరో చిరుత చిక్కింది. అలిపిరి (Alipiri) నడకమార్గంలో శ్రీ నరసింహ స్వామి ఆలయం 7వ మైలు రాయి మధ్య ప్రాంతంలో చిరుత బోనులో చిక్కినట్లు అటవీ శాఖ అధికారులు చెప్పారు. దీనితో కలిపి రెండు నెలల కాలంలో మొత్తం ఐదు చిరుతలను బందించారు.

తిరుమల (Tirumala) అలిపిరి మెట్ల మార్గంలో సుమారు నాలుగు రోజుల క్రితమే ఈ చిరుత (Leopard) ట్రాప్ కెమెరా కంట పడింది. అప్పటి నుంచి అధికారులు దాన్ని బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. గత నెల అలిపిరి మెట్ల మార్గంలో చిరుత దాడి చేయడంతో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక మృతి చెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుమల కొండల్లో మరీ ముఖ్యంగా అలిపిరి మెట్ల మార్గంలో పలు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేసిన చిరుతలను పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో చిరుత బోనులో చిక్కింది. మరోవైపు అలిపిరి మార్గంలో తిరుమలకు వచ్చే భక్తులకు చేతి కర్రలను ఇస్తోంది టీటీడీ దేవస్థానం.