Newspillar
Newspillar
Saturday, 09 Sep 2023 18:30 pm
Newspillar

Newspillar

మూవీ రిపోర్ట్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) పుష్ప కు సీక్వేల్ గా తెరకెక్కుతున్న మూవీ పుష్ప 2 (Pushpa 2). ఈ సినిమాలో ప్రియమణి (Priyamani) నటిస్తోందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. పుష్ప-2 మూవీలో విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని, ఆయన భార్యగా ప్రియమణి కనిపించనున్నారని ఫిల్మి నగర్ టాక్. ఈ ప్రచారంపై తాజాగా ప్రియమణి స్పందించారు. పుష్ప-2 సినిమాలో తాను నటించడం లేదని ప్రియమణి స్పష్టం చేశారు. ఈ ప్రచారం చూసి వెంటనే తన మేనేజరుకు ఫోన్‌ చేసి ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు ఆమె చెప్పారు. ఐతే అవకాశం వస్తే అల్లు అర్జున్‌ తో కలిసి నటించేందుకు తాను రెడీ అన్నారు ప్రియమణి. బాలీవుడ్‌ బాద్షా షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) తాజా సినిమా జవాన్‌ (Jawan) లో కీలక పాత్ర పోషించారు ప్రియమణి.