Newspillar
Newspillar
Sunday, 17 Sep 2023 18:30 pm
Newspillar

Newspillar

ఇంటర్నేషనల్ రిపోర్ట్- అగ్రరాజ్యం అమెరికా (America) లో వందల కోట్ల విలువైన ఫైటర్‌ జెట్ (F-35 Fighter Jet) మాయమైపోయింది. మిస్ అయిన ఫైటర్‌ జెట్ ఆచూకి చెప్పాలని మిలిటరీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంకేముందు అమెరికా మిలిటరీ అధికారుల వ్యవహారశైరి దుమారం రేపుతోంది. అమెరికా (USA) మిలిటరీకి చెందిన ఫైటర్‌ జెట్ అదివారం టేకాఫ్ అయిన కాసేపటికే అత్యవసర పరిస్థితి తలెత్తడంతో సౌత్‌ కరోలినా లోని బ్యూఫోర్ట్ ఎయిర్ స్టేషన్ నుంచి అమెరికా ఫైటర్ జెట్‌ ఎఫ్‌-35 (F-35 Fighter Jet) కనిపించకుండో పోయింది. ఈ ఫైటర్‌ జెట్ విలువ వందల కోట్లలో ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఇప్పుడు ఇది కనిపించకుండా పోవడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐతే ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. కానీ ఆ తరువాతే అది కనిపించకుండా పోయింది. చార్లెస్టన్‌ లో ఫెడరల్ ఏవియేషన్ రెగ్యులేటర్‌ తో కలిసి ఫైటర్‌ జెట్ ను వెతుకుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆ సిటీలోని రెండు సరస్సులను తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఫైటర్‌ జెట్ (F-35 Fighter Jet) వెతికేందుకు స్థానికులు కూడా సహకరించాలని మిలిటరీ అధికారులు కోరారు. ఇలా యుధ్ద విమానం ఆచూకి తెలపమని ప్రజలుకు చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.