Newspillar
Newspillar
Friday, 22 Sep 2023 18:30 pm
Newspillar

Newspillar

పొలిటికల్ రిపోర్ట్- తెలుగుదేశ్ పార్టీ (TDP), జనసేన (Janasena) పార్టీ పొత్తులపై ఏపీ బీజేపీ అధినేత్రి దగ్గుబాటి పురంధేశ్వరి (Purandeswari) స్పందించారు. రాష్ట్రంలో పొత్తులపై అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని పురంధేశ్వరి అన్నారు. టీడీపీతో పొత్తుపై జనసేని అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తమ అధిష్ఠానానికి వివరిస్తారని, ఆ తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటారని ఆమె చెప్పారు. ఐతే రాష్ట్రంలో ఎన్నికల పొత్తులపై కేంద్ర నాయకత్వం తమ అభిప్రాయాలు కూడా తీసుకుంటుందని అన్నారు పురంధేశ్వరి. పొత్తులపై తమ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందుకు రాష్ట్ర నాయకత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. అమరావతిలో ప్రజావేదిక కూల్చివేత నుంచే రాష్ట్రంలో అరాచక పాలన మొదలైందని ఈ సందర్బంగా పురంధేశ్వరి జగన్ సర్కార్ పై మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రజా స్వామ్యంలో ఇది మంచి పద్దతి కాదని పురందేశ్వరి అన్నారు.