Newspillar
Newspillar
Wednesday, 27 Sep 2023 00:00 am
Newspillar

Newspillar

ఇంటర్నేషనల్ రిపోర్ట్- ఇరాక్‌ (Iraq) లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వివాహ వేడుక జరుగుతున్న ఓ ఫంక్షన్‌ హాల్‌ లో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 113 మంది చనిపోయారు. పెళ్లికి హాజరైన వారిలో 100 మందికి పైగా మృతి చెందడంతో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ అగ్ని ప్రమాదంలో మరో 500 మందికి పైగా అతిథులు గాయపడినట్లు అధికారులు చెప్పారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన వారిలో నూతన వధూవరులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘోర అగ్నిప్రమాదం ఉత్తర ఇరాక్‌ లోని అల్‌ హమ్‌ దానియా ప్రాంతంలో జరిగింది. అగ్ని ప్రమాదానికి సంబందించిన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక  సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పెళ్లి వేడుకలో భాగంగా బాణాసంచా పేల్చడంవల్లే అర్ని ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. Iraq fire Broke Out