Newspillar
Newspillar
Monday, 09 Oct 2023 18:30 pm
Newspillar

Newspillar

అమరావతి రిపోర్ట్- దెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై (Chandrababu) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన వైకాపా ప్రతినిధుల సభలో సీఎం మాట్లాడారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదు కాబట్టి ఆయన ప్రజల్లో ఉన్నా, జైల్లో ఉన్నా పెద్ద తేడా ఏమీ ఉండదని ఈ సందర్బంగా జగన్ అన్నారు. చంద్రబాబును ఎవరూ కక్ష సాధింపుతో అరెస్టు చేయలేదన్న ఆయన, చంద్రబాబుపై తనకెలాంటి కక్షా లేదని చెప్పారు. తాను లండన్‌ లో ఉన్నప్పుడు చంద్రబాబును పోలీసులు ఎత్తారు (అరెస్టు చేశారు) అని అన్నారు సీఎం జగన్. దత్తపుత్రుడు (Pawan Kalyan) బీజేపీతోనే ఉన్నానని ఇప్పటికీ అంటున్నారని గుర్తు చేసిన జగన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితో పాటు ఆ పార్టీలోని సగం మంది టీడీపీ మనుషులే ఉన్నారని వ్యాఖ్యానించారు. 

అయినా కేంద్రంలోని ఐటీ, ఈడీలు చంద్రబాబుపై విచారణ జరిపి అవినీతిపరుడని నిరూపించాయని చెప్పారు. చంద్రబాబు మీద ప్రధాని మోదీ అవినీతి ఆరోపణలు చేసిన టైంలో మనం (YCP) ప్రతిపక్షంలో ఉన్నామని జగన్ ప్రతినిధుల సభలో గుర్తుచేశారు. అంటే అప్పటికే మోదీకి, కేంద్రానికి అన్నీ తెలుసు కాబట్టే సీబీఐ, ఈడీ, ఐటీ విభాగాలను రాష్ట్రంలోకి అడుగుపెట్టనివ్వనని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఉపసంహరించుకున్నారని, అప్పటికే అవినీతిపరుడని స్పష్టమైన చంద్రబాబు మీద విచారణ చేయకూడదట, ఆధారాలను చూసి కోర్టు రిమాండ్‌కు పంపినా చంద్రబాబు లాంటి వారిని చట్టానికి పట్టివ్వడానికి వీల్లేదని పచ్చ బ్యాచ్‌లు వాదిస్తున్నాయని అన్నారు సీఎం జగన్.