Newspillar
Newspillar
Tuesday, 10 Oct 2023 18:30 pm
Newspillar

Newspillar

స్పెషల్ రిపోర్ట్ - భారత్ లో అత్యంత ధనవంతుల్లో మరోసారి అగ్రస్థానంలో నిలిచారు ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani). ఇదే సమయంలో గౌతమ్‌ అదానీ (Goutham Adani) సంపద విలువ తగ్గిపోగా, అంబానీ సంపద విలువ స్వల్పంగా పెరిగింది. ఈమేరకు 360 వన్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2023 మంగళవారం విడుదలైంది. ఈ యేడాది ఆగస్టు 30 నాటికి ఆయా వ్యక్తుల సంపద ఆధారంగా, దేశంలోని 138 నగరాల నుంచి మొత్తం 1319 మంది ఈ జాబితాలో చోటు సంపాదించారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ సంపద 2 శాతం వృద్ధి చెంది 8.08 లక్షల కోట్లకు చేరింది.ఇక గౌతమ్ అదానీ సంపద ఏకంగా 57 శాతం క్షీణించి 4.74 లక్షల కోట్లకు తగ్గిపోయింది. దీంతో అదానీ కుబేరుల జాబితాలో రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఇఖ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా అధిపతి సైరస్‌ పూనావాలా సంపద విలువ 36 శాతం పెరిగడంతో ఆయన ధనవంతుల జాబితాలో మూడో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 

హెచ్‌సీఎల్‌ టెక్‌ వ్యవస్థాపకులు శివ్‌నాడార్‌ సంపద 23 శాతం పెరగడంతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచి హురున్‌ జాబితాలో (Hurun India Rich list 2023) మొత్తం 105 మంది చోటు దక్కింది. మొత్తం 105 మంది సంపద విలువ 5.25 లక్షల కోట్లుగా ఉండటం గమనార్హం. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 33 శాతంపెరిగింది. ఇందులో అయిదుగురు మహిళలు ఉడటం విశేషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 12 మంది బిలియనీర్లు ఉన్నారు. దివీస్‌ మురళి 55,700 కోట్లతో మొదటిస్థానంలో ఉండగా, మేఘా ఇంజినీరింగ్‌కు చెందిన పిచ్చి రెడ్డి 37,300 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. 35,800 కోట్ల్ రూపాయలతో మెఘా కృష్ణా రెడ్డి మూడవ స్థానంలో, 21,900 కోట్లతో హెటేరో డ్రగ్స్ పార్ధసారధి రెడ్డి నాలుగో స్థానంలో, 17,500 కోట్లతో మైహోమ్ గ్రూప్ జూపల్లి రామేశ్వర్ రావు ఐదో స్థానంలో ఉన్నారు.