Newspillar
Newspillar
Monday, 16 Oct 2023 18:30 pm
Newspillar

Newspillar

మూవీ రిపోర్ట్- మెగా హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripati)ల వివాహ సందడి ప్రారంభమైంది. వీరిద్దరి పెళ్లి వేడుకలో భాగంగా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ అట్టహాసంగా జరిగాయి. ఇక ఇప్పుడు అల్లు అరవింద్ నివాసంలో గ్రాండ్‌ పార్టీ జరిగింది. కాబోయే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుకు శుభాకాంక్షలు చెబుతూ అల్లు అర్జున్‌ కుటుంబ సభ్యులు ఈ పార్టీని అరెంజ్ చేశారు. చిరంజీవి, అల్లు అరవింద్‌ కుటుంబ సభ్యులతో పాటు హీరో నితిన్‌, ఆయన భార్య షాలినీ, హీరోయిన్ రీతూవర్మ, మరికొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈ పార్టీలో సందడి చేశారు.

ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలను అల్లు శిరీష్‌ (Allu Shirish) తాజాగా అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేశారు. త్వరలో జరగనున్న వరుణ్‌త తేజ్ - లావణ్య  త్రిపాఠి పెళ్లిని పురస్కరించుకుని మా ఇంట్లో ఓ పార్టీ జరిగిందని చెప్పారు అల్లు శిరీష్. ఇక వరుణ్‌ తేజ్‌ - లావణ్య త్రిపాఠి మిస్టర్‌ సినిమా టైంలో ఫ్రెండ్స్ అయ్యారు. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి అంతరిక్షం మూవీలో నటించారు. ఈ సినిమా షూటింగ్‌ లోనే వీరి మధ్య ప్రేమ పుట్టింది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నారు. నవంబర్‌ 1వ తేదీన వీరి వివాహ వేడుక జరగనుందని సమాచారం. ఇటలీలోని టస్కానీ వీరి వివాహానికి వేదిక కానుందని ప్రచారం జరుగుతోంది.