Newspillar
Newspillar
Monday, 16 Oct 2023 18:30 pm
Newspillar

Newspillar

హైదరాబాద్ రిపోర్ట్- ఆలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) సొంత పార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. రేవంత్ పార్టీ టిక్కెట్స్ ను అమ్ముకుంటున్నారని చెప్పడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. 10 కోట్ల రూపాయలు, 5 ఎకరాల భూమికి గద్వాల టికెట్‌ ను రేవంత్ రెడ్డి అమ్ముకున్నారని టీపీసీసీ కార్యదర్శి కురువ విజయ్ కుమార్ (Vijay Kumar) ఆరోపించారు. రేవంత్ వ్యవహారాన్ని తప్పుబుతూ హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌ వద్ద ఆయన ఆందోళన చేపట్టారు.

నాడు ఓటుకు నోటు.. నేడు సీటుకు నోటు.. అంటూ తన అనుచరులతో కలిసి నినాదాలు చేశారు. మొత్తం 65 కాంగ్రెస్ పార్టీ సీట్లను 600 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి అమ్ముకున్నారని ఈ సందర్బంగా విజయ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యకారులకు టికెట్లు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి కాకుండా, పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికే టికెట్లు ఇచ్చారని ఫైర్ అయ్యారు. రేవంత్‌ రెడ్డిని వెంటనే టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కురవ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు.