Newspillar
Newspillar
Wednesday, 15 Nov 2023 18:30 pm
Newspillar

Newspillar

స్పెషల్ రిపోర్ట్- ఈసారి తెలంగాణ శాసనసభఎన్నికల బరిలో భారీ సంఖ్యలో అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 2,290 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈనెల 15న నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీ కావడంతో మొత్తం 608 మంది అభ్యర్ధులు తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ్ధినేత కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 70 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇక్కడ కేసీఆర్ తో పాటు మొత్తం 44 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న మరో నియోజకవర్గమైన కామారెడ్డిలో నామినేషన్ల ఉపసంహరణ తరువాత 39 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక తెలంగాణలో అత్యధికంగా ఎల్‌బీ నగర్‌లో మొత్తం 48 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. ఆ తరువాతి స్థానంలో పాలేరు ఉండగా ఇక్కడ 37 మంది, కోదాడలో 34 మంది అభ్యర్ధులు, నాంపల్లిలో 34 మంది అభ్యర్ధులు, ఖమ్మంలో 32 మంది అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. ఇక నల్గొండ నియోజకవర్గంలో 31 మంది, కొత్తగూడెంలో 30 మంది అభ్యర్ధులు పోటీ చేస్తున్నారని ఎన్నికల సంఘం తెలిపింది. ఈనెల 30న తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. గెలుపుపై ప్రధాన పార్టీలన్నీ ధీమాతో ఉన్నాయి.