Newspillar
Newspillar
Wednesday, 15 Nov 2023 18:30 pm
Newspillar

Newspillar

అమరావతి రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ స్కిల్‌ డెవలప్‌ మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తమ వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబందించి ఇరు వైపులా వాదనలు ముగియడంతో బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయని, దీంతో ఎన్నికలకు ముందు కావాలనే చంద్రబాబును అరెస్టు చేశారని చంద్రబాబు తరపు అడ్వకేట్ సిధ్దార్ధ్ లూధ్రా కోర్టు దృష్టికి తెచ్చారు.

బెయిల్‌పై విచారణ జరుగుతున్న సందర్భలో కేసు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని, ఈ కేసుకు సంబంధించి 2018 నుంచి విచారణ జరుగుతుండగా, ఇప్పుడు ఇంత ఆదరాబాదరాగా విచారణ చేయాల్సిన అవసరం ఏముందని వాదించారు. సీమెన్స్‌ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ అంతా వెరిఫై చేయలేదని రాశారని గుర్తు చేసిన లూధ్రా.. ఈ ఫోరెన్సిక్‌ రిపోర్టు చంద్రబాబును ఇరికించడం కోసమే తయారు చేశారని వాదించారు. ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ చేయలేదని ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేసిన వారే రిపోర్టులో చెప్పారని, ఇదంతా చంద్రబాబును కేసులో ఇరికించేందుకు పధకం ప్రకారం పన్నిన కుట్ర అని కోర్టులో వాదించారు సిద్దార్ధ్ లూథ్రా. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. AP Skill Development Case