Newspillar
Newspillar
Monday, 04 Dec 2023 18:30 pm
Newspillar

Newspillar

ఎలక్షన్ రిపోర్ట్- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Election Results 2023) కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్ పార్టీ రెండవస్తానంలో నిలిచింది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్‌ పార్టీ 64 సీట్లలో గెలిచి అధికారం కైవసం చేసుకోగా, బీఆర్ఎస్ 39 స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో, ఎంఐఎం 7, సీపీఐ ఒక స్థానంలో గెలుపొందాయి. దీంతో తెంలగాణలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మొత్తం 92,35,792 ఓట్లు అంటే 39.40శాతం ఓట్లు రాగా, బీఆర్ఎస్ కు 87,53,924 ఓట్లు 37.35 శాతం మేర వచ్చాయి. ఇక బీజేపీకి 32,57,511 ఓట్లు అంటే 13.90 శాతం ఓట్లు రాగా, ఎంఐఎం 5,19,379 ఓట్లు 2.22శాతం వచ్చాయి. మరోవైపు నోటాకు 0.73 శాతం 1,71,940 ఓట్లు వచ్చాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిలో పోటీ చేయగా గజ్వెల్ లో గెలవగా, కామారెడ్డిలో ఓడిపోయారు. అంటు రేవంత్ రెడ్డి సైతం కొడంగల్ లో గెలుపొందగా, కామారెడ్డిలో ఓడిపోయారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యేలు..వివేకానంద - కుత్బుల్లాపూర్‌ - 85,576 ఓట్లు, హరీశ్‌రావు - సిద్దిపేట- 82,308 ఓట్లు, మాధవరం కృష్ణారావు - కూకట్‌పల్లి - 70,387 ఓట్లు, వేముల వీరేశం - నకిరేకల్‌ - 68,838 ఓట్లు, ప్రేమసాగర్‌రావు -మంచిర్యాల- 66,116 ఓట్లు, కుందూరు జైవీర్‌ రెడ్డి- నాగార్జున సాగర్‌ - 55,849 ఓట్లు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి- నల్గొండ - 54,332 ఓట్లు సాధించి మెజార్టీలో రికార్డు సాధించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులు నీరంజన్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, పువ్వాడ అజయ్‌ కుమార్ లు ఓటమిపాలయ్యారు. కేటీఆర్‌, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, మల్లారెడ్డి, జగదీశ్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌ లు గెలిచారు.