Newspillar
Newspillar
Monday, 04 Dec 2023 18:30 pm
Newspillar

Newspillar

మూవీ రిపోర్ట్- బాలీవుడ్ బాద్షా షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) ఈ సంవత్సరం రెండు సూపర్ హిట్ సినిమాలతో మంచి స్పీడ్ మీద ఉన్నాడు. ఇదిగో ఇప్పుడు మరో మూవీ డంకీ తో (Dunki) హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అయ్యాడు. ప్రముఖ డైరెక్టర్ రాజ్‌ కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ నటించిన డంకీ మూవీ కోసం ఆయన అభిమానులు, సినీ ప్రియులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా డంకీ సినిమాకు సంబందించిన ట్రైలర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. భావోద్వేగంతో పాటు నవ్వులను పంచుతోన్న డింకీ మూవీ ట్రైలర్‌ అందరిని ఆకట్టుకుంటున్నారు. 

రాజ్‌ కుమార్‌ హిరాణీ విజన్‌ నుంచి ఈ కథ నాతో మొదలవుతుంది.. నా ఫ్రెండ్స్‌తో కలిసి నేను దీన్ని ముగిస్తాను.. స్నేహం, కామెడీ, విషాదం.. ఇలా ఎన్నో ఎమోషన్స్‌ ఇందులో ఉన్నాయి.. ఇది చూసిన ప్రతి ఒక్కరికీ వాళ్ల కుటుంబంతో ముడిపడిన జ్ఞాపకాలు గుర్తొస్తాయి.. అందరి ఎదురు చూపులు ఫలించాయి.. ట్రైలర్‌ను చూసి ఆనందించండి.. అని చెప్పారు షారుక్ ఖాన్. మొత్తానికి ట్రైలర్ షారుక్ అభిమానుల్లో ఆసక్తిని మరించగా పెంచడంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.