Newspillar
Newspillar
Friday, 08 Dec 2023 18:30 pm
Newspillar

Newspillar

అసెంబ్లీ రిపోర్ట్- మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) కాంగ్రెస్ ప్రభుత్వం ముందు తన మొదటి డిమాండ్ ను ఉంచారు. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు వాయిదా తరువాత మీడియా పాయింట్ లో హరీశ్ రావు మాట్లాడారు. తెలంగాణ రైతులంతా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోందని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో వడ్లు అమ్ముకోకండి, బోనస్‌ తో వడ్లు కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారని ఈ సందర్బంగా గుర్తు చేశారు.

ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయల బోనస్‌తో వడ్లు ఎప్పుడు కొంటారో చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. తుపాన్ కారణంగా కొన్ని చోట్ల వడ్లు తడిసాయని, వాళ్ళను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వచ్చాక రైతు బంధు కింద ఎకరాకు 15 వేల రూపాయలు డిసెంబర్ 9న ఇస్తామన్న కాంగ్రెస్.. రైతుబంధు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా ఎప్పుటికీ మేం ప్రజల పక్షాన నిలబడతామని హరీశ్ రావు అన్నారు.