Newspillar
Newspillar
Wednesday, 27 Dec 2023 18:30 pm
Newspillar

Newspillar

చెన్నై రిపోర్ట్- ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ (71) (Vijayakanth) ఇకలేరు. పలు అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న విజయ్ కాంత్ ను కుటుంబ సభ్యులు చెన్నైలోని మియాట్‌ ఇంటర్నేషనల్‌ (MIOT International) ఆస్పత్రిలో  చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. కొన్ని రోజుల క్రితం తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న విజయకాంత్‌.. డిశ్చార్జి అయ్యారు. ఇంతలోనే మరోసారి ఆస్పత్రి పాలయ్యారుకెప్టెన్‌ విజయ్ కాంత్ మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన అభిమానులు కన్నీటి పర్వంతం అవుతున్నారు.

నటుు కెప్టెన్ విజయకాంత్‌ 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురైలో జన్మించారు. విజయ్ కాంత్ అసలు పేరు నారాయణన్‌ విజయరాజ్‌ అళగర్‌స్వామి. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత విజయకాంత్‌గా పేరు మార్చుకున్నారు. విజయకాంత్‌కు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. 27 ఏళ్ల వయసులో విజయకాంత్‌ సినీ రంగప్రవేశం చేశారు. 1979లో ఇనిక్కుమ్‌ ఇలమై (Inikkum Ilamai) సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో తెరపై కనిపించారు. 2015 వరకు నిర్విరామంగా నటించారు విజయ్ కాంత్.  Actor Vijayakanth passed away