Newspillar
Newspillar
Sunday, 07 Jan 2024 18:30 pm
Newspillar

Newspillar

నేషనల్ రిపోర్ట్- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (Indian Air Force) మరో ఘనత సాధించింది. పాకిస్థాన్‌ తో ఉన్న నియంత్రణ రేఖకు సమీపంలోని కార్గిల్‌ ఎయిర్‌ స్ట్రిప్‌ (Kargil Airstrip) పై మొట్టమొదటి సారి రాత్రి సమయంలో సి-130జె (C-130 J) రవాణా విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసింది భారత వాయుసేన. సముద్రమట్టానికి 10,500 మీటర్ల ఎత్తులో ప్రతికూల భౌగోళిక, వాతావరణ పరిస్థితుల మధ్య కార్గిల్ వైమానిక స్థావరం ఉంది. గతంలో ఎయిర్‌ స్ట్రిప్‌ నుంచి యుద్ధవిమానాలు రాకపోకలు సాగించేవి. ఐతే భారీ రవాణా విమానం.. అదీ రాత్రి సమయంలో దిగడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. సి-130జె విమానం ల్యాండింగ్ కోసం టెరైన్‌ మాస్కింగ్‌ విధానాన్ని కూడా ఉపయోగించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇక్కడ దిగిన సి-130జె విమానంలో వాయుసేనకు చెందిన గరుడ్‌ కమాండోలు ప్రయాణించారు. కార్గిల్‌ ఎయిర్‌ స్ట్రిప్‌ పై ఈ విన్యాసాన్ని నిర్వహించడం ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరోసారి తన సత్తా చాటింది.