Newspillar
Newspillar
Sunday, 07 Jan 2024 18:30 pm
Newspillar

Newspillar

హైదరాబాద్ రిపోర్ట్- తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయహస్తం హామీలకు సంబంధించి 1.05 కోట్ల దరఖాస్తులు వచ్చాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) తెలిపారు. రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు విజయవంతంగా పూర్తి చేశారని ఆయన చెప్పారు. ప్రజాపాలనపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) సచివాలయంలో ఉన్నస్థాయి సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసిన తరువాత మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు మీడియాతో మాట్లాడారు.

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 40 రోజుల్లో నెరవేరుస్తామని ఎక్కడా చెప్పలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. ప్రజా పాలన ధరఖాస్తులను మొత్తం 30వేల మంది ఆపరేటర్లతో డేటా ఎంట్రీ వేగంగా జరుగుతోందని పొంగులేటి చెప్పారు. మరోవైపు ఆరు గ్యారంటీల అమలుకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీలో తనతో పాటు మంత్రి శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్ లు సభ్యులుగా ఉంటామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.