Newspillar
Newspillar
Wednesday, 27 Mar 2024 00:00 am
Newspillar

Newspillar

మూవీ రిపోర్ట్- పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) మూవీ షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ కు సంబంధించిన ఓ న్యూస్ సోప్రచారం జరుగుతోంది. నిన్నిటి వరకు సినిమా షూటింగ్స్ కోసం, వెకేషన్స్ కోసం ప్రభాస్ అక్కడికి వెళ్లినప్పుడల్లా అదే ఇంట్లో ఉండేవారని, అద్దెను కోటి రూపాయల వరకు అద్దె చెల్లించేవారని తెలుస్తోంది. అందుకే ప్రభాస్ కు ఆ ఇల్లు బాగా నచ్చడంతో భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఐతే ఇంటి కొనుగోలుకు సంబందించి ప్రభాస్ నుంచి గాని, ఆయన కుటుంబం నుంచి కానీ అధికారిక ప్రకటన లేదు.

ఇక ప్రభాస్ సినిమాల సంగతికి వస్తే.. గత సంవత్సరం సలార్ మూవీతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు ప్రభాస్. సైన్స్ ఫిక్షన్ మూవీగా భారీ బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కుతోంది. బాలీవుడ్ నటి దీపికా పదుకొణె, బిగ్ బి అమితాబ్ బచ్చన్, దిశా పటానీ తదిదరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పోషిస్తోన్న భైరవ పాత్రను ఉద్దేశించి నిర్మాత స్వప్నదత్ఈ మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భైరవ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలుస్తుందని చెప్పడంతో ప్రభాస్ అభిమానుల్లో ఆసక్తినెలకొంది.