Newspillar
Newspillar
Monday, 01 Apr 2024 00:00 am
Newspillar

Newspillar

బిజినెస్ రిపోర్ట్- పసిడి ధర (Gold Rate) క్రమంగా పెరుగుతోంది. తాజాగా బంగారం ధర ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకుంది. బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర సోమవారం సాయంత్రం నాటికి 70,978 పలుకుతోంది. అంతకు ముందు రోజుతో పోలిస్తే 10 గ్రాముల బంగారం దాదాపు 1000 రూపాయలు పెరిగింది. అంతర్జాతీయంగా బంగారానికి విపరీతంగా డిమాండ్‌ పెరగడంతో ధరలు పెరుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

రానున్న రోజుల్లోను బంగారానికి డిమాండ్ బాగుంటుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ లో సీనియర్‌ అనలిస్ట్‌ దిలీప్‌ పర్మార్‌ అంటున్నారు. అంతే కాకుండా చైనా నుంచి సైతం బంగారానికి డిమాండ్‌ పెరగడమూ ఇందుకు మరో కారణమని చెప్పారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో స్పాట్‌ గోల్డ్‌ ఔన్స్‌ (31.10 గ్రాములు) 2,265.73 డాలర్ల వద్ద ట్రేడవుతుండటం గమనార్హం. మరోవైపు వెండి సైతం కిలో 1,120 రూపాయల మేర మేర పెరిగి 78,570కి చేరింది.