Newspillar
Newspillar
Friday, 12 Apr 2024 00:00 am
Newspillar

Newspillar

ఢిల్లీ రిపోర్ట్- ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితను (Kalvakuntla Kavitha) కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ పై రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా, ఈనెల 14 వరకు 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తిరిగి ఈనెల 15 ఉదయం 10 గంటలకు కవితను కోర్టులో హాజరు పర్చాలని న్యాయమూర్తి ఇచ్చిన తీర్పులో పేర్కొన్నారు. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు నేపథ్యంలో కవితను సీబీఐ కేంద్ర కార్యాలయానికి తరలించారు. డిల్లీ పాలసీ విధానంలో కీలక సూత్రధారి, పాత్రధారి కవిత అని సీబీఐ కోర్టులో వాదించింది. ఈ కేసు విచారణకు ఆమె సహకరించడంలేదని, అందుకే కస్డడీకి ఇవ్వాలని కోరుతున్నట్లు కోర్టుకు విజ్ఞప్తి చేసింది. దీంతో మూడు రోజుల పాటు కవితను సీబీఐ కస్టడీకి ఇస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది.