Newspillar
Newspillar
Saturday, 13 Apr 2024 18:30 pm
Newspillar

Newspillar

ఖమ్మం రిపోర్ట్- మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేవెళ్ల సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని, తెలంగాణలో ఆయన విద్యుత్‌ రంగాన్ని భ్రష్టు పట్టించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. మిగులు బడ్జెట్‌ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అదనంగా ఎకరం భూమికి కూడా నీరు ఇవ్వని కాళేశ్వరం ప్రాజెక్టుకు సంవత్సరానికి 10 వేల కోట్ల రూపాయల విద్యుత్‌ బిల్లులు కట్టేలా చేశారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క గంట కూడా కరెంట్‌ పోకుండా సరఫరా చేస్తున్నామని చెప్పారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి విద్యుత్‌ రంగాన్ని భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్‌ ప్లాంట్లలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణలో విద్యుత్‌ వ్యవస్థను అల్లకల్లోలం చేసి, మళ్లీ మాపైనే విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.