Srram Stone

రాయిపై శ్రీరామ్‌ అని ఉండటంతో భక్తుల పూజలు

నదిలో తేలుతున్న రాయి.. రామసేతు రాయంటూ పూజలు

నేషనల్ రిపోర్ట్- రాయి సాధారణంగా నీళ్లలో ముగినిపోతుంది. అది చిన్నదైనా, పెద్దదైనా నీళ్లలో మాత్రం తేలియాడదు. కానీ బిహార్‌ (Bihar) లో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. పట్నాలోని గంగానది రాజ్‌ఘాట్‌ (Raj Ghat) వద్ద దొరికిన ఓ రాయి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఈ రాయి ఆ ప్రాంతంలో ఇపుడు చర్చనీయాంశంగా మారింది. గంగా నదిలో తేలియాడుతూ కనిపించిన ఈ రాయిపై శ్రీరామ్‌ (Sriram) అని ఉండటంతో భక్తులు పూజలు చేస్తున్నారు. 

నదీ తీరాన ఉన్న ఓ ఆలయంలో నీటితొట్టిలో ఉంచిన ఈ రాయిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం భారీగా తరలివస్తున్నారు. రాయి దొరికిన రాజ్‌ఘాట్‌ పేరును రామ్‌ ఘాట్‌గా మార్చాలని కూడా కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. అది రామసేతులోని రాయేనని, ఈ రాయిపై పరిశోధన జరపాలని స్థానికులు కోరుతున్నారు. మరి ఈ అద్భుతమైన రాయికు సంబందించి ఏం తేల్చబోతున్నారన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.


Comment As:

Comment (0)