Pakistan

దేశవ్యాప్తంగా జులై 22 నుండి జులై 24 వరకు పెట్రోల్ బంకులు బంద్

 పాకిస్తాన్ లో తీవ్ర ఆర్థిక సంక్షోభం.. దేశంలో పెట్రోల్ బంకులు బంద్

ఇంటర్నేషనల్ డెస్క్- పాకిస్తాన్ (Pakistan) గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఒక్కసారిగా ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో పాకిస్తాన్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. దీంతో పాకిస్తాన్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పాకిస్తాన్ లో లీటరు పెట్రోల్ (Petrol) 253 రూపాయలు కాగా డీజిల్ ధర 253.50 రూపాయలుగా ఉంది. అసలే నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతుంటే ఇటువంటి సమయంలో మార్జిన్ పెంచాలని పట్టుబట్టింది పాకిస్తాన్ పెట్రోలియం డీలర్ల సంఘం.
 
పాకిస్తాన్ పెట్రోలియం డీలర్ల అసోషియేషన్ పాక్ ప్రభుత్వం పెట్రోల్ ధరలపై తాము కోరిన విధంగా లీటరు పెట్రోల్ పై 5 శాతం అంటే సుమారు 12 రూపాయల మార్జిన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఐతే షెబాజ్ షరీఫ్ ప్రభుత్వం నుంచి కేవలం 2.4 శాతం అంటే 6 రూపాయలు మాత్రమే మార్జిన్ దక్కుతుందని అసంతృప్తి వ్యక్తం చేసింది. మొత్తానికి శనివారం సాయంత్రం నుండే దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 10 వేల పెట్రోల్ బంకులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది పాకిస్తాన్ పెట్రోలియం డీలర్ల అసోషియేషన్ (Pakistan Petrol Dealers Association). అంబులెన్స్, పాల వ్యాన్, పోలీసు వాహనాలు వంటి ఎమెర్జెన్సీ వాహనాలకు సైతం పెట్రోల్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు చెప్పడంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది.

 


Comment As:

Comment (0)