Dubai Floods

ఎడారి దేశంలో ఎందుకీ వరదలు

దుబాయ్ ని ముంచెత్తిన భారీ వరదలు

ఇంటర్నేషనల్ రిపోర్ట్- ఎడారి దేశం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ (UAE) ను వరదలు ముంచెత్తుతున్నాయి. తీవ్ర ఎండలు, పొడి వాతావరణంతో ఎప్పుడూ ఉక్కిరిబిక్కిరయ్యే దుబాయ్‌లో(Dubai floods) ఆకస్మిక వర్షాలరు చాలా ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలకు తోడు తీవ్రమైన గాలులలతో జనజీవనం స్తంభించిపోయింది. దుబాయ్ లో చాలా ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలోనే 142 మిల్లీ మీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఇంతటి భారీ వర్షాలు మునుపెన్నడూ కురవలేదని అధికారుల చెబుతున్నారు.

సాధారణంగా దుబాయ్ లో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంలో సైతం ఎడతెరపి లేని కుండపోత వర్షాలకు క్లౌడ్‌ సీడింగ్‌ (Cloud seeding) కారణమనే అంటున్నారు. మాములుగా ఎండాకాలంలో ఇక్కడ గరిష్ఠంగా 50 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. దీంతో దుబాయ్ లో వార్షిక వర్షపాతం సగటున 200 మిల్లీ మీటర్ల లోపే నమోదవుతుంది. అందుకే ఈ పరిస్థితులను అధిగమించేందుకు దుబాయ్ లో కృత్రిమ వర్షాలను కురిపించే క్లౌడ్‌ సీడింగ్‌ పద్ధతిని అమలు చేస్తున్నారు. రోజు రోజుకు దేశంలో పెరుగుతోన్న జనాభాకు సరిపడా తాగునీరు అందించడం కోసం దుబాయ్ ప్రభుత్వం ఈ క్లౌడ్ సీడింగ్ విధానాన్ని అమలుచేస్తోంది.


Comment As:

Comment (0)