Pakistan PUBG Love

పాకిస్థాన్ వివాహిత - ఇండియా యువకుడి ప్రేమ కధలో ట్విస్టుల మీద ట్విస్టులు 

పాకిస్థాన్ స్పెషల్ రిపోర్ట్- ఇండియా (India) యువకుడు, పాకిస్థాన్ (Pakistan) వివాహిత ప్రేమ కధ రోజుకో మలుపు తిరుగుతోంది. సినిమా కధను మించి మలుపుల మీడ మలుపులు తిరుగుతోంది. కరోనా సమయంలో ప్రపంచం మొత్తం భయంతో క్షణమొకయుగంలా బతుకుతుంటే పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్ (Seema haider) , భారత్ కు చెందిన సచిన్ మీనా (Sachin Meena) మాత్రం ఎంచక్కా ప్రేమలో పడ్డారు. సోషల్ మీడియా వీడియో ప్లాట్ ఫామ్ పబ్జీ (PUBG) ద్వారా మొదలైన పరిచయాన్ని ప్రేమగా మార్చుకున్నారు వీరిద్దరు. ఐతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అప్పటికే ఆ మహిళకు పెళ్ళై నలుగురు పిల్లలున్నారు.

అయినా కూడా ఇండియాలో ఉన్న ప్రియుడిని కలుసుకునేందుకు పాకిస్థాన్ నుంచి వచ్చేసి పెద్ద సాహసం చేసింది. ఈనెల జులై 4న ఢిల్లీ శివారు ప్రాంతం గ్రేటర్ నోయిడా లోని ప్రియుడు సచిన్ మీనా దగ్గరకు చేరుకున్న సీమా హైదర్ పై అక్రమ చొరబాటు కేసు నమోదు చేశారు పోలీసులు. ఐతే ఈ కేసులో ఆమెకు బెయిల్ వచ్చింది. కానీ తాను పాకిస్థాన్ వెళ్లేది లేదని చెప్పిన సీమా ఇకపై తాను హిందువునని, పర్మినెంట్ గా ఇక్కడే ఉండిపోతానని చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది. 

గులాం హైదర్ (Gulam Haider) అనే వ్యక్తితో సీమాకు పదేళ్ల క్రితం పెళ్లయిందని, ఆయన సౌదీలో పనిచేస్తుంటాడని, ఆమె మాత్రం మూడేళ్ళుగా ఇక్కడ పిల్లలతో ఒంటరిగా ఉండేదని పాకిస్థాన్ లోని ఆమె నివాసం ఉండే ఇంటి ఓనర్ అబ్బాయి నూర్ మహమ్మద్ చెప్పాడు. వాళ్ళ మామయ్యగారు ఇక్కడికి చాలా దూరంగా ఉంటారని తెలిపారు. ఈ క్రమంలో సీమా గులాం హైదర్ తిరిగి పాకిస్తాన్ వస్తే ఊరుకునేది లేదన్నారు ఆమె బంధువులు. హిందువైన యువకుడి కోసం వెళ్ళిపోయిన ఆమె ఇకపై ముస్లిం కాదని, పిల్లల్ని మాత్రం వెంటనే పాకిస్తాన్ తిరిగి పంపించేయాలని డిమాండ్ చేశారు.
 


Comment As:

Comment (0)