McDonalds

చిన్న పాపకు వేడి చికెన్‌ నగెట్స్‌.. మెక్‌ డొనాల్డ్స్‌కు 6.5 కోట్ల జరిమాన

ఇంటర్నేషనల్ డెస్క్- ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫుడ్ చైన్ సంస్థ మెక్ డోనాల్డ్స్ (McDonald) కు చేదు అనుభవం ఎదురైంది. చికెన్‌ నగెట్స్‌ తిందామనుకున్న ఓ చిన్నారికి బాగా వేడిగా ఉన్న ఆహారం అందించినందుకు మెక్‌ డొనాల్డ్స్‌ కు పెద్ద మొత్తంలో ఫైన్‌ పడింది. అమెరికా (USA)లోని ఒలివియా లో కారబల్లో అనే నాలుగేళ్ల చిన్నారి 2019లో ఫ్లొరిడా లోని ఫోర్ట్‌ లాడర్‌ డేల్‌ సమీపంలో మెక్‌ డొనాల్డ్స్‌ డ్రైవ్‌ ఇన్‌ కు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లింది. అక్కడ హ్యాపీ మీల్‌ ను ఆర్డర్ చేసింది. తినేందుకు కారులో బాక్స్‌ ఓపెన్ చేయగా విపరీతమైన వేడిగా ఉన్న ఓ నగెట్‌ ఆ చిన్నారు కాలుపై పడింది. దీంతో ఆమె కాలుకు స్వల్ప గాయమైంది. ఈ ఘటనతో ఆ చిన్నారి భయంతో చాలా సేపు ఏడుస్తూనే ఉంది.

చలించిపోయిన ఒలివియా కుటుంబ సభ్యులు మెక్‌ డొనాల్డ్స్‌పై ఫ్లొరిడాలోని న్యాయస్థానంలో కేసు వేశారు. చిన్నారి గాయం ఫొటోలుఆ సమయంలో పాప బాధతో ఏడుస్తున్న ఆడియోను కోర్టుకు సమర్చించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆ చిన్నారికి గతంలో పడిన ఇబ్బందికి నాలుగు లక్షల డాలర్లు, భవిష్యత్తు కోసం మరో నాలుగు లక్షల డాలర్లు మొత్తం 8 లక్షల డాలర్లు చెల్లించాలని మెక్ డోనాల్డ్స్ ను ఆదేశించింది కోర్టు. అంటే మన కరెన్సీలో అక్షరాల 6.5 కోట్ల రూపాయలన్నమాట.


Comment As:

Comment (0)