News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఆమె + ఆమె = ప్రెగ్నెంట్

ఆమె మ‌రో మ‌హిళ‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అంతేకాదు.. ఇప్పుడు  పెళ్లి చేసుకున్న మ‌హిళ గ‌ర్భ‌వ‌తి అయ్యింది. అంతేకాదు.. ఈ ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు  ప్ర‌భుత్వం ప్ర‌సూతి సెల‌వులు కూడా ఇచ్చింది..! ఏంటీ.. వింటుంటే.. మైండ్  బ్లాంక్ అయ్యిందా.. అవును ఇది ముమ్మాటికి నిజం. అలాని వారేదో అల్లాట‌ప్పా మ‌హిళ‌లు అనుకుంటే మీరు త‌ప్పులో క‌లేసిన‌ట్లే.. ఆ ఇద్ద‌రు మ‌హిళ‌లు కూడా ఇంటర్ నేష‌న‌ల్ క్రీకెట‌ర్స్ కావ‌డం  విశేషం. ఈ ఇంట్ర‌స్టింగ్ స్టోరీ వివారాల్లోకి వెలితే..

criketer_ami_shaterth_waite_and_thahuhu_marrege

న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ అమీ శాటెర్త్‌వైట్ (32) , త‌న జ‌ట్టులో  ఫాస్ట్ బౌల‌ర్  తహుహు (28) తో ప్రేమ‌లో ప‌డింది. ఇంకేముంది  వారిద్ద‌రు 2010 నుండి స‌హ‌జీవ‌నం చేసి… 2017 మార్చీలో ఒక్క‌ట‌య్యారు అంటే.. పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు సీన్ క‌ట్ చేస్తే.. త‌న స‌హ‌చ‌రి త‌హుహు గ‌ర్బ‌వ‌తి అని.. శాటెర్త్‌వైట్ ఎంతో సంతోషంగా ప్ర‌క‌టించింది. తమ జీవితంలో కొత్త అధ్యయం మొదలవబోతోందని శాటెర్త్‌వైట్ మంగళవారం ట్విట్టర్ లో ఆనందాన్ని పంచుకుంది. అంతేకాదు.. త‌మ‌కు పుట్ట‌బోయే బిడ్డకు బేబీ శాటర్ హుహు గా పేర్కొన్న శాటెర్త్‌వైట్ ..2020 జనవరిలో తమ జీవితంలోకి రాబోతోందంటూ ఓ బేబీ ఫ్రాక్‌ను పోస్టు చేసింది. అయితే, ఇద్ద‌రు మ‌హిళ‌లే అయిన వీరు .. ఏ పద్ధతుల ద్వారా  బిడ్డకు జన్మనివ్వబోతున్నారన్న విషయం సీక్రెట్ గా ఉంచింది  శాటెర్త్‌వైట్.

- Advertisement -

criketer_ami_shaterth_waite_on__thahuhu_pregnent

ఇదిలావుంటే.. శాటెర్త్‌వైట్ తోపాటు త‌హుహు ల‌కు .. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వేతనంతో కూడిన మాతృత్వపు సెలవును మంజూరు చేయడం విశేషం. ఒక కుటుంబంగా మారే క్రమంలో ఆట నుంచి కొంత విరామం తీసుకోవడానికి న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇస్తున్న మద్దతుకు ఆనందంగా ఉందని, తామెంతో అదృష్టవంతురాళ్ళ‌మ‌ని శాటెర్త్‌వైట్ దంప‌తులు ఆనందం వ్య‌క్త‌చేస్తున్నారు. ఇక  ఈ దంప‌తుల క్రికెట్ ట్రాక్  రికార్డ్ ను ఓసారి ప‌రీశీలిస్తే..  గతేడాది న్యూజీలాండ్  ఉమెన్స్ క్రికెట్  జట్టు పగ్గాలు  శాటెర్త్‌వైట్ చేపట్టింది. ఇప్ప‌డి వ‌ర‌కు  అమీ.. 119 వన్డేలు, 99 టీ20లు ఆడింది. వన్డేల్లో వరసగా నాలుగు సెంచరీలు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డులకెక్కింది శాటెర్త్‌వైట్ . ఇక పాస్ట్ బౌల‌ర్ గా  జ‌ట్టులో చేరిన త‌హుహు..త‌ను ఆడిన  116 మ్యాచ్‌లలో 114 వికెట్లు పడగొట్టింది. అయితే తామిద్ద‌రం.. 2021 ప్రపంచకప్ నాటికి తిరిగి జట్టులో చేరి న్యూజీలాండ్ క్రికె్ట్ కు సేవ‌లందిస్తామ‌ని అంటున్నారు ఈ న‌వ దంప‌తులు.

newzealand_ami_shaterth_waite_and_bouler_thahuhu_still

Leave A Reply

Your email address will not be published.