News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

కాంగ్రెస్ జ‌ల‌‌ దీక్షలు…

తెలంగాణ‌లో కాంగ్రేస్ పార్టీ పోరుబాట ప‌ట్టింది. తెలంగాణ‌లో పెండింగ్ ప్రాజెక్టు కోసం ధీక్ష‌ల‌కు దిగ‌నుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సం జూన్ 2 ను వేదికగా చేసుకొని కృష్ణానదిపై పెండింగ్ ప్రాజెక్టుల వద్ద నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు ప్ర‌క‌క‌టించారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. కాంగ్రెస్ హాయంలో ప్రారంబించి.. సింహ‌భాగం పూర్తి అయినా.. వాటిని పెండింగ్ లో పెట్టిన కేసీఆర్ ప్ర‌భుత్వం తీరును ఎండ‌గ‌ట్టేందుకు జ‌ల ధీక్ష‌ల‌కు పిలుపు నిచ్చారు కెప్టెన్ ఉత్త‌మ్. గాంధీ భవన్‌లో జరిగిన కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎస్‌ఎల్‌బీసీ వద్ద ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి దీక్ష చేపట్టనున్నారు.

- Advertisement -

ఇక‌ పాలేరు జలాశయం వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు సీతక్క, పొదెం వీరయ్యలు దీక్షకు కూర్చోనున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గంలోని లక్ష్మీదేవీపల్లి పంపు హౌస్‌ వద్ద ఎంపీ రేవంత్‌ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, ఏల్లూరు జలాశయం వద్ద మాజీ మంత్రి నాగం జనార్దన్‌ రెడ్డి నిరసన తెలియజేయనున్నారు. కరివేన జలాశయం వద్ద ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం వద్ద ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం వద్ద వంశీచంద్‌ రెడ్డి నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. ఆవిర్భావ దినోత్సవం రోజున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష చేపట్టనున్నట్లు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వివరించారు. మరోవైపు జూన్‌ 6వ తేదీన గోదావరిపై పెండింగ్‌ ప్రాజెక్టుల వద్ద కూడా దీక్ష చేపట్టనున్నట్లు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. ఈ దీక్షల ద్వారా సీఎం కేసీఆర్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు నిజాలు తెలిసేలా చేస్తామన్నారు.

Leave A Reply

Your email address will not be published.