News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

కేసీఆర్.. జ‌రా ఉస్మానియాకో ధేఖో..


సీఎం కేసీఆర్ కు స‌చివాల‌యాన్ని కూల్చ‌డంపై ఉన్న శ్ర‌ద్ద‌.. పేద‌ల‌కు ఆశాదీపంగా ఉన్న ఉస్మానియా ఆసుప‌త్రిని బాగుచేయాల‌న్న‌దానిపై లేద‌ని అన్నారు పీసీసీ ఛీఫ్ , ,న‌ల్గొండ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. నేడు ఉస్మానియా అసుపత్రిలో నెల‌కొన్న‌ దుస్థితికి సీఎం కేసీఆర్ వైఫ‌ల్య‌మే కార‌ణం అన్నారు. చిన్న పాటీ వ‌ర్షానికే ఉస్మానియాలోకి మొకాళ్ల‌లోతు నీళ్లు వ‌చ్చి.. రోగులు ప‌డుతున్న‌ న‌ర‌క యాత‌న సీఎం కేసీఆర్ కు క‌న‌బ‌డ‌టం లేదా అని ప్రశ్నించిన‌ ఉత్త‌మ్… త‌క్ష‌ణ‌మే 500 కోట్ల‌తో ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భ‌వ‌నాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. పార్టీ గ్రేటర్ నాయ‌కుల‌తో క‌లిసి.. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.. ఉస్మానియ ఆసుపత్రిని సంద‌ర్శించి.. అక్క‌డి రోగుల‌ను అడిగి వివ‌రాలు తెలుసుకున్నారు.

తెలంగాణ‌కే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఉస్మానియా ఆసుప్ర‌తి నిర్వ‌హ‌ణ‌ను ప్ర‌భుత్వం గాలి కొదిలేసింద‌ని ఆరోపించారు ఉత్త‌మ్. ఒక‌వైపు క‌రోనా భ‌యాన‌క‌ ప‌రిస్తితుల్లో చిన్న వ‌ర్షానికే వార్డ్ ల‌లోకి వ‌ర‌ద నీరు వ‌స్తుంటే.. ప్ర‌భుత్వం చోద్యం చూస్తుంద‌ని మండిప‌డ్డారు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. ఉస్మానియా ఆసుప‌త్రి సూప‌రిండెంట్ తో సహా.. 150 మంది డాక్ట‌ర్ల‌కు క‌రోనా పాజీటీవ్ వ‌చ్చింద‌ని.. క‌నీసం వారికి కోవిడ్ తో ర‌‌క్ష‌ణ క‌ల్పించే పీపీఈ కిట్ ల‌ను అందించాల‌న్న సోయి ప్ర‌భుత్వానికి లేకుండా పోయింద‌ని ఫైర్ అయ్యారు. ఇది పేద‌ల‌కు ఆరోగ్యం అందించే ఉస్మానియా పై కేసీఆర్ కు ఉన్న చిత్త శుద్దికి అద్దం ప‌డుతుంద‌ని అన్నారు ఉత్త‌మ్. వార‌స‌త్వ సంప‌ద‌గా ఉన్న ఉస్మానియా ఆసుపత్రి భ‌వ‌నాన్ని ప‌రిర‌క్షించుకోవాల‌న్ని ఉత్త‌మ్.. 500 కోట్ల‌తో ఆధునిక వ‌స‌తుల‌తో ఉస్మానియా కాంప్లెక్స్ లో కొత్త భ‌వంతిని నిర్మించాలని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు

ప్ర‌తి రోజు రెండు వేల మంది వ‌చ్చి ఉస్మానియా ఆసుప‌త్రిలో క‌నీస మౌలిక స‌దుపాయాలు కూడా ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలేద‌న్న ఉత్త‌మ్ .. రాస్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చిన కేసీఆర్ కు .. ఉస్మానియాకు ఖ‌ర్చు చేసుందుకు డ‌బ్బులు లేకుండా పోయాయా అని నిల‌దీశారు. ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి కోవిడ్ పేషంట్ ల‌కు చికిత్సి చేస్తున్న డాక్ట‌ర్లు, ఆరోగ్య సిబ్బందికి 50 శాతం ఇన్సెంటీవ్ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

ఇక క‌రోనా చికిత్స‌ను ఆరోగ్య‌ శ్రీ ఫ‌థ‌కంలోకి తీసుకురావాలిన డిమాండ్ చేసిన ఉత్త‌మ్.. వైధ్యుల‌కు నాణ్య‌మైన పీపీఈ కిట్ ల‌ను అందించాల‌ని సూచించారు. అంతేకాదు.. క‌రోనా ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ గా ప‌నిచేస్తున్న డాక్ట‌ర్ల‌తో పాటు.. పారిశుద్ద సిబ్బంది, పోలీసులు, జ‌ర్న‌లీస్ట్ ల‌కు 50 ల‌క్ష‌ల బీమాను క‌ల్పించాల‌న్న ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.. క‌రోనాతో మృతి చెందిన వ‌క్తి కుటుంబానికి 10 ల‌క్ష‌ల ఎక్స్ గ్రేసీయా ఇవ్వాలని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.