News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

“ఖ‌మ్మం” హాట్ కేక్

హైద‌రాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు అంద‌రి చూపు ఆ ఎంపీ సీటు పైనే . నాకంటే నాకంటు.. నేత‌లు ఆ సీటుకోసం  పోటీ ప‌డుతున్నారు. అంతేకాదు.. లోక‌ల్ ..నాన్ లోక‌ల్ అన్న తేడా లేకుండా.. అంద‌రు  ఆసీటుపైనే ఆశ‌లు పెట్టుకున్నారు.. ఇంత‌కు ఏదా సీటు అనుకుంటున్నారా.. .అదే ఖ‌మ్మం పార్ల‌మెంట్. మొన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు చూసిన త‌ర్వాత‌.. టిఆర్ఎస్ తో డ‌బ్బుల్లో పోటీ ప‌డ‌లేమురా బాబు..! ఈ రాజ‌కీయాలు చేయ‌లేమురా బాబు..!! అనుకునే నేత‌లు సైతం..  ఆ ఖ‌మ్మం  సీటు ఇస్తే మాత్రం ఓకే అంటున్నారు. ఇంత‌లా ఖ‌మ్మం లోక్ స‌భ కు ఉన్న క్రేజీ ఎంటీ అనుకుంటున్నారా.? అయితే కాస్త ఆగండి వివరాల్లోకి వెళ‌దాం..

- Advertisement -

తెలంగాణ‌లోని మొత్తం 17 లోక్ స‌భ సీట్లుండ‌గా..  ఖ‌మ్మం పార్ల‌మెంట్ సీటు మాత్రం హ‌స్తం పార్టీలో హ‌ట్ కేక్ లా మారింది. పార్టీలో  సీనియ‌ర్ ,జూనియ‌ర్ అన్న తేడా లేకుండా.. ఖ‌మ్మం సీటుపై ఆశ‌లు పెట్ట‌కున్నారు. దీనికి కార‌ణం..ఆ స్తానం ప్ర‌స్తుతం కాంగ్రెస్ కు సేఫ్ క‌వ‌డ‌మేన‌ట‌. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ఖ‌మ్మం సీటు ఒక్క‌టే సేఫ్ స్లేస్ అని నేత‌లు భావిస్తుండ‌ట‌మే.. ఆ సీటుకు అంత‌లా డిమాండ్ ను పెరిగింద‌ట‌. మొన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం పార్ల‌మెంట్ ప‌రిధిలో కాంగ్రెస్ మ‌ధిర .. కొత్త‌గూడెం .. పాలేరు సీట్లు గెల‌వ‌గా ..మిత్ర‌ప‌క్షంగా ఉన్న‌ టిడీపీ స‌త్తుప‌ల్లి .. అశ్వారావు పేట అసెంబ్లీ  సీట్లను గెలివ‌గా.. టీఆర్ఎస్ కేవ‌లం ఖ‌మ్మం అసెంబ్లీని మాత్ర‌మే ద‌క్కించుకుంది. దీనికితోడు.. ఖ‌మ్మ సామాజీక వ‌ర్గం ఓట‌ర్లు.. టిడిపి ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌టంతో.. హ‌స్తం నేత‌లు  ఖ‌మ్మం పార్ల‌మెంట్ ను సేఫ్ జోన్ గా భావిస్తున్నారు. దీంతో ఎలా గోలా.. ఖ‌మ్మం ఎంపీ టికెట్ సాధిస్తే చాలు..  విజ‌యం ద‌క్కించుకున్న‌ట్లేన‌ని ఫీల్ అవుతున్నారు.
/viyashanthi_on_khammam_mp
ఇక ఈ పార్ల‌మెంట్ టికెట్ పై ఆశ‌లు పెట్టుకున్న వారిలో రేణుకా చౌద‌రి, పొంగులేటీ సుధాక‌ర్ రెడ్డి, విజ‌య‌శాంతి, వి హ‌నుమంత్ రావు, గాయ‌త్రి ర‌వి ..వీరే కాకుండా.. త‌మ‌కు ఓసారి అవ‌కాశం క‌ల్పిస్తే మేము రెఢీ అంటున్నార‌ట మ‌రి కొంద‌రు నేతలు. తాను గ‌తంలో ఎంపిగా, కేంద్ర మంత్రిగా  ప‌నిచేసిన రేణుకా చౌద‌రి ..ఈ సారి నాకే టికెట్ అన్న ధీమాలో ఉండ‌గా.. ఎన్నో ఏండ్ల నుండి తాను పెట్టుకున్న ఆశ‌లు ఈ సారి టికెట్ తో నెర‌వేర‌బోతున్నాయ‌ని పొంగులేటీ ఉన్నారు. ఇక గాంది ఫ్యామిలికి న‌మ్మిన బంటును కాబ‌ట్టి త‌న‌కే అంటున్నారు వి హ‌నుమంత్ రావు. మ‌రోవైపు విజ‌య‌శాంతి సైతం ఖ‌మ్మం సీటుపై మ‌న‌సు పారేసుకుంద‌ట‌. తాను పోటీ చేస్తే ఇక్క‌డి నుండే పోటీ చేస్తాన‌ని చెబుతుంద‌ట విజ‌య‌శాంతి.ఇక మ‌రోవైపు గాయ‌త్రి గ్రైనైట్ ర‌వి కూడా టికెట్ కోసం ప్ర‌య‌త్నాలు చేసుకుంటున్నారు. మ‌రీ ఇంత‌మంది పోటీ ప‌డుతున్న ఈ ఖ‌మ్మం పార్ల‌మెంట్ టికెట్ ఎవ‌రికి ద‌క్కుతుందో చూడాలి.

 

Leave A Reply

Your email address will not be published.