News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

పది మంది కొత్త మంత్రులు

ఎట్టకేలకు తెలంగాణలో నూతన మంత్రివర్గం ఏర్పాటైంది. మొత్తం పది మంది మంత్రులతో గవర్నర్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు, వి. శ్రీనివాస్‌ గౌడ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌ మంత్రులుగా  ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం తరువాత మంత్రులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దగ్గరకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపి ఆశీర్వాదం తీసుకున్నారు. దాదాపు మంత్రులంతా కేసీఆర్ కు పాదాబివందనం చేశారు. ఇక మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ప్రమాణస్వీకారం తరువాత గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ లు నూతన మంత్రులతో ఫోటో దిగారు.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.