News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు..

హైదరాబాద్ : అనేక కార‌ణాల‌తో అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో ఓట‌మి పాల‌య్యాము.. పార్ల‌మెంట్ ఎన్నిక‌లలో ప‌క‌డ్బందీగా వ్య‌హ‌రిద్దాం, గెలుపు అవ‌కాశాలు చాల ఉన్నాయి, కాంగ్రెస్ ప‌ట్ల జ‌నం సానుకూలంగా ఉన్నారు… ప్ర‌ధానంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల‌ని కోరుకుంటున్నారు, రాహుల్ గాంధీని ప్ర‌ధానిమంత్రి కావాల‌ని దేశ ప్ర‌జ‌లు ఆకాంక్షిస్తున్నారు, తెలంగాణ నుంచి మెజారిటీ సీట్లు సాధించాల‌ని టిపిసిసి అధ్యక్షులు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి అన్నారు. శ‌నివారం నాడు గ‌చ్చిబౌళిలోని ఒక ప్రైవేట్ హోట‌ల్‌లో ఏడు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల స‌న్నాహ‌క స‌మావేశాలు జ‌రిగాయి. నిన్న పెండింగ్ ప‌డ్డ వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ స‌మావేశంతోపాటు మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్‌, ఖ‌మ్మం, మ‌హ‌బూబాబాద్‌, న‌ల్గొండ‌, భువ‌న గిరి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్ష జ‌రిగింది.

Tpcc meeting

టిపిసిసి కార్య నిర్వాహ‌క అధ్యక్షులు కుసుమ‌కుమార్ అధ్యక్ష‌త‌న జ‌రిగిన ఈ  స‌మావేశంలో ఉత్త‌మ్‌తోపాటు ఎఐసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాంచంద్ర కుంటియా, సి.ఎల్‌.పి నేత భ‌ట్టి విక్ర‌మార్క‌, కార్య నిర్వ‌హ‌క అద్య‌క్షులు పొన్నం ప్ర‌భాక‌ర్‌, అజ‌రుద్దీన్‌, ఎఐసిసి కార్య‌ద‌ర్శులు శ్రీ‌నివాస్ కృష్ణ‌న్‌, స‌లీం, చిన్నారెడ్డి, వంశీ చంద‌ర్ రెడ్డి, సంప‌త్‌ల‌తోపాటు ఎం.ఎల్‌.ఎ గండ్ర‌వెంట‌క‌ర‌మ‌ణారెడ్డి, ఆయా పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని డిసిసి అధ్యక్షులు, ముఖ్య నాయ‌కులు మ‌ల్లు ర‌వి, వి.హ‌నుమంత‌రావు, ఎం.పి నందిఎల్ల‌య్య‌ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా డిసిసి అధ్యక్షులు, నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండ‌ల అధ్యక్షులు పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వ్యూహంపైన వారి అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు.

Tpcc meeting

ప్ర‌ధానంగా టిక్కెట్ల కేటాయింపులు తొంద‌ర‌గా జ‌ర‌పాల‌ని, అభ్య‌ర్థుల‌ను వెంట‌నే ప్ర‌క‌టించ‌డం వ‌ల్ల ప్ర‌చారం చేసుకునేందుకు చాల స‌మ‌యం దొర‌కుతుందని ప్ర‌చారంలో వెనుక‌బ‌డ‌కుండా ప్ర‌చార వ్యూహాలు నిర్వ‌హించేందుకు స‌మ‌యం ఉంటే మ‌న‌కు మ‌ద్ద‌తు ల‌భించే అవ‌కాశాలుంటాయ‌ని నాయ‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు. కాగా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ‌తంతో పోలిస్తే ప్ర‌జ‌లు కాంగ్రెస్ వైపు చాల మొగ్గు చూపుతున్నార‌ని, ఉప ఎన్నిక‌ల‌కు పోలిస్తే అసెంబ్లీలో జ‌నం కాంగ్రెస్‌కు కొంత అనుకూలంగా వ‌చ్చార‌ని, ఇటీవ‌ల స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ చాల గ్రామాల‌లో ప‌ద‌వుల‌ను ద‌క్కించుకుంద‌ని ఇది కాంగ్రెస్‌కు ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న మ‌ద్ద‌తుకు నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు.

- Advertisement -

రాబోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌లో తెలంగాణ ప్ర‌జ‌లు కాంగ్రెస్ వైపు ఉండేందుకు చాల అవ‌కాశాలున్నాయ‌ని, రాహుల్ గాంధీని ప్ర‌ధాన‌మంత్రి చేయాల‌నే తప‌న జ‌నంలో క‌నిపిస్తుంద‌ని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు  చేసిన కాంగ్రెస్‌కు ఒక‌సారి అవ‌కాశం ఇవ్వాల‌ని తెలంగాణ ప్ర‌జ‌లు భావిస్తున్నార‌ని ఆయ‌న వివ‌రించారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జాతీయ స్థాయి అంశాల‌తో ముడిప‌డి ఉన్నందున జాతీయ స్థాయిలో న‌రేంద్ర మోడి ఒక విఫ‌ల ప్ర‌ధాన‌మంత్రిగా నిలిచిపోయార‌ని అలాంటి ప‌రిస్థితుల‌లో జ‌నం కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని అన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో చాల అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని, అయితే వాటి గురించి ప‌క్క‌న పెట్టి ఇప్పుడు మ‌రింత ప‌క‌డ్బందీగా ఎన్నిక‌ల‌లో పాల్గొనాల‌ని ఆయ‌న సూచించారు. బూత్ లెవ‌ల్ ఎజెంట్ల నియామ‌కం విష‌యంలో నాయ‌కులు చాల శ్ర‌ద్ద‌గా ప‌నిచేయాల‌ని సూచించారు.

Tpcc meeting

ఓట‌ర్ల తొల‌గింపు, చేరిక‌లు, ఎన్నిక‌ల సంఘం అంశాల‌ను చాల సీరియ‌స్‌గా ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ప‌నిచేయాల‌ని ఇది చాల కీల‌క‌మైన అంశమ‌ని అన్నారు. గ‌తంలో 22 ల‌క్ష‌ల ఓట్లు తొల‌గిపోయాయ‌ని ఎన్నిక‌ల సంఘం క్ష‌మాప‌ణ చెప్పింద‌ని అయితే మ‌నం కూడా ఓట్ల తొల‌గింపుల విష‌యంలో ప్ర‌స్తావించినా కూడా ఎక్క‌డ చేరిక‌ల విష‌యంలో స‌రైన శ్ర‌ద్ద తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల న‌ష్టం జ‌రిగింద‌ని అన్నారు. ఈ సారి అలా కాకుండా ఒక్క ఓటు కూడా న‌ష్ట‌పోకుండా బూత్ లెవ‌ల్ ఏజెంట్ల‌ను నియ‌మించి స‌రైన విధంగా ప‌ని చేయాల‌ని అన్నారు.

డిసిసిలు పార్ల‌మెంట్ అభ్య‌ర్థుల విష‌యంలో వారి సిఫార‌సుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని గాంధీభ‌వన్‌కు ఆయా పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల వారిగా వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌ల‌ను, ద‌ర‌ఖాస్తుల‌ను డిసిసిలు స్వీక‌రించి ఆయా జిల్లాలు, పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ముఖ్య నాయ‌కుల‌తో చ‌ర్చించి ఒక‌టి నుంచి మూడు నాలుగు పేర్ల ను సిఫార‌సు చేయాల‌ని సూచించారు. వాటిలో 17వ తేదీన జ‌రిగే ప్ర‌దేశ్ ఎన్నిక‌ల సంఘం స‌మావేశంలో చ‌ర్చించి ఎఐసిసి కి నివేధిక ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని ఆయ‌న వివ‌రించారు.

- Advertisement -

ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్‌.సి కుంటియా మాట్లాడుతూ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల‌లో విజ‌యం సాధించ‌డం కోసం ప్ర‌తి కార్య‌క‌ర్త అకుంఠిత దీక్ష‌తో ప‌నిచేయాల‌ని అన్నారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం త‌క్కువ‌గా ఉంద‌ని, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయ‌డం వ‌ల్ల ఫ‌లితాలు బాగుంటాయ‌ని ఆయ‌న వివ‌రించారు. నాయ‌కుల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని మంచి ఫ‌లితాలు వ‌చ్చేలా చూస్తామ‌ని ఆయ‌న అన్నారు.

Leave A Reply

Your email address will not be published.