News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలి ..!

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో కాంగ్రెస్ బీజేపీల మ‌ద్య పొలిటిక‌ల్ వార్ రోజు రోజుకు ముదురుతోంది. ప్ర‌త్యామ్నాయం మేమంటే మేమంటూ ఒక‌రినొక‌రు టార్గెట్ చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ న‌డ్డా తెలంగాణ‌లో ప‌ర్య‌ట‌న‌తో ఇది మ‌రింత తీవ్ర‌త‌ర‌మైయ్యింది. రాష్ట్రంలో బీజేపీ బ‌ల‌ప‌డుతోందంటూ ఆ పార్టీ నేత‌లు చేస్తున్న హ‌డావిడి అంతా మైకుల‌కే ప‌రిమిత‌మ‌ని పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి విమ‌ర్శలు గుప్పించారు. గాంధీభ‌వ‌న్ లో ఫేస్ బుక్ లైవ్ ద్వారా పార్టీ క్యాడ‌ర్ తో మాట్లాడిన ఆయ‌న .. అస‌లు న‌డ్డా స‌మ‌క్షంలో భారీ చేరిక‌లంటూ బీజేపీ చేసిన హాడావిడి అంతా కొండ‌ను త‌వ్వి ఎలుక‌ను ప‌ట్టిన‌ట్లుగా ఉందంటూ ఎద్దెవా చేశారు. రాజకీయాల్లో అవుట్ డేటెడ్ నేత‌ల చేరిక‌లతో ఏదో జ‌రిగిపోతుందంటూ బిల్డ‌ప్ ఇస్తున్నారంటూ ఉత్త‌మ్ ఫైర్ అయ్యారు.

Uttam

ఇక న‌డ్డా ప‌ర్య‌ట‌న‌లో కేసీఆర్ స‌ర్కారును టార్గెట్ చేయ‌డంపైనా కూడా ఉత్త‌మ్ ప‌లు అనుమానాల‌ను వ్య‌క్తం చేశారు. బీజేపీ .. టీఆర్ఎస్ ల మ‌ద్య లాలూచీ రాజ‌కీయాలు న‌డుస్తున్నాయ‌ని ఆరోపించిన ఆయ‌న .. గ‌త ఐదేళ్ళ‌లో ఈ రెండు పార్టీల వ్య‌వ‌హారం ప్ర‌జ‌ల‌కంతా అవ‌గాహ‌న ఉందన్నారు. గ‌త ఐదేళ్ళ‌లో కేసీఆర్ అవినీతిపై తాము మాట్లాడితే స్పందించ‌ని బీజేపీ నాయ‌కులు .. ఇప్పుడు మాత్రం కేసీఆర్ అవినీతి అంటూ మాట్లాడ‌టంలో చిత్త‌శుద్ది ఎంత అంటూ ప్ర‌శ్నించారు.

uttam

- Advertisement -

అస‌లు జేపీ న‌డ్డా త‌న ఆరోప‌ణ‌ల ప‌ట్ల చిత్త‌శుద్దితో ఉంటే కేసీఆర్ పై వ‌స్తున్న అవినీతి ఆరోప‌ణ‌ల‌పై వెంట‌నే సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణ‌లో బీజేపీ మ‌త‌త‌త్వ రాజ‌కీయ డ్రామాలు న‌డువంటున్న పీసీసీ కెప్టెన్ .. రాష్ట్రంలో బీజేపీ ప‌వ‌నాలంటూ కాషాయ నేత‌లు ప‌గ‌టి క‌ల‌లు కంటున్నార‌ని ఎద్దెవా చేశారు. టీఆర్ఎస్ కు కాంగ్రెస్సే ప్ర‌త్యామ్నాయ‌మ‌ని స్ప‌ష్టం చేసిన ఆయ‌న .. 2023లో కేసీఆర్ ను గ‌ద్దె దించేది తామేనన్నారు.

Uttam

ఇక మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ 75 వ జయంతి వేడుక‌ల‌ను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిచాల‌ని పార్టీ క్యాడ‌ర్ కు ఉత్త‌మ్ సూచించారు. రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు గాంధీభవన్ లో కూడా ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నామ‌ని ఆయ‌న త‌న ఫేస్ బుక్ లైవ్ లో పార్టీ నాయ‌కుల‌కు వివ‌రించారు. దేశ స్వాతంత్ర్యము కోసం గాంధీ కుటుంబం పని చేసిందన్న ఉత్త‌మ్ ..వారి త్యాగాలను గ్రామ గ్రామన తీసుకెళ్ళాలన్నారు. నెహ్రు త్యాగాన్ని తగ్గించాలని బీజేపీ చూస్తుందని మండిప‌డిన పీసీసీ చీఫ్ .. స్వాతంత్ర్య ఉద్యమంలో నెహ్రు 22 సార్లు జైలు కు వెళ్ళాడని .. 10 సంవ‌త్స‌రాలు జైలు జీవితం గ‌డిపాడ‌ని గుర్తు చేశారు. ఇక కేసీఆర్ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వమ‌ని మండిప‌డిన ఉత్త‌మ్ .. మున్సిపల్ కొత్త చట్టం లోప భూయిష్టంగా ఉందని ఫైర్ అయ్యారు.

Uttam

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.