News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

రక్తసిక్తమైన జమ్మూ కశ్మీర్ రహదారి

దేశంలో ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారు. రోజుకో చోటు పేలుళ్లకు పాల్పడుతూ విద్వంసం సృష్టిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో స్కూలో లో బాంబు పేలుడు ఘటన జరిగిన ఒఖ రోజు కూడా గడవకముందే ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. పుల్వామా జిల్లా అవంతిపుర సమీపంలో సీఆర్పీఎఫ్‌ జవాన్లు వెళ్తున్న వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ముందు తుపాకీలతో కాల్పులు జరిపిన తరువాత, ఐఈడీతో దాడులు చేశారు.  జమ్ముకశ్మీర్‌ ప్రధాన రహదారిపై నిలిపి ఉంచిన ఓ ఆటోరిక్షాలో ఐఈడీని ఏర్పాటు చేసి సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌ అక్కడికి రాగానే ఆ వాహనాన్ని పేల్చేశారు.

blast

- Advertisement -

పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్‌ వాహనం ముక్కలు ముక్కలైంది. ఈ ఘటనలో మొత్తం 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పొయ్యారు. పలువురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పేలుడు వల్ల ఆ ప్రాంతమంతా భీభత్సంగా మారింది. తెగిపడిన శరీర అవయవాలతో రోడ్డు రక్తసిక్తమయ్యింది. పేలుడు జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా సిబ్బంది గాయపడిని వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇక సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై తామే దాడి చేసినట్లు జైషే ఈ మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

Leave A Reply

Your email address will not be published.