News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

వినాయక చవితి పూజలో ఉత్తమ్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పీసిసి చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి ఉత్తమ్ పద్మావతి వినాయక చవితి సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు అన్ని శుభాలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలకు అన్ని విఘ్నాలు తొలగిపోయి.. అంతా మంచి జరగాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, రాజ్య సభ సభ్యులు కేవీపీ రాంచంద్రా రావు, పొన్నం ప్రభాకర్, వంశీ చందర్ రెడ్డి, సంపత్ కుమార్ తదతరులు పాల్గొన్నారు.

uttam
అనంతరం దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధింతి సందర్బంగా గాంధీ భవన్ లో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నేతలు. ఈ సందర్బంగా మాట్లాడిన ఉత్తమ్.. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని అన్నారు. కానీ టీఆర్ ఎస్ నేతలది మాత్రం కమీషన్ల కోసం కక్కుర్తి అని విమర్శించారు. తాము సాగునీటి ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదన్న ఉత్తమ్.. ప్రాజెక్టుల నిర్మాణంలో జరుగుతున్న అవినీతిని మాత్రమే ప్రశ్నిస్తున్నామని చెప్పారు. తెలంగాణలోని ప్రజా వ్యతిరేక విధానాలపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు పోరాటం చేస్తారని ఉత్తమ్ స్పష్టం చేశారు.

- Advertisement -

Tags: uttam, pcc chief uttam, ganesh chaturthi, ganesh puja in gandhi bhavan, uttam perform ganesh puja in gandhi bhavan, uttam floral tributes ys rajashekar reddy

Leave A Reply

Your email address will not be published.