News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

సిగ‌రేట్ ..క‌రోనాకు కాస్ దోస్థ్ ..


క‌రోనా… ధూమ పానం చేసేవారికి మ‌ర‌ణ‌శాసం రాస్తుందా..? స్మోకింగ్ అలవాటు ఉంటే చాలు.. కరోనా క‌బ‌లించ‌డం ఖాయ‌మా..? అవునంటున్నాయి తాజా స‌ర్వేలు. శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా యూనివర్సీటికి చెందిన పరిశోధకులు 8వేల 405 మందిపై పరిశోధన జరుప‌గా… వారిలో 18 నుంచి 25 ఏళ్లలోపు వయసు వారే. 8వేల 405 మందిలో 32శాతం మందికి కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. దానికి ప్రధాన కారణం ధూమపానం అలవాటు ఉండ‌ట‌మేన‌ట‌. . అయితే.. ఏళ్ల‌త‌ర‌బ‌డి స్కోక్ చేస్తున్న‌వారే కాదు.. గత 30 రోజుల నుంచి స్మోకింగ్ చేస్తున్న వారిని కూడా కరోనా అటాక్ చేస్తుంద‌ని స‌ర్వేలో తేలింది.

యూత్ అయినా స‌రే.. స్మోకింగ్ ఉంటే అంతే సంగ‌తులు అంటున్నారు ఎక్స్ ఫ‌ర్ట్స్ .”కరోనాకి స్మోకింగ్ కి రిలేషన్ ఉంది. ధూమపానం అలవాటు ఉన్నవారికి కరోనా సోకితే తీవ్ర అస్వస్థతకు గురవుతారు. ఐసీయూలో చికిత్స అందించాల్సి ఉంటుంది. మరణం సంభవించే చాన్స్ ఎక్కువ” అని రీసెర్చర్ ఆడమ్స్ తెలిపారు. అమెరికాలో చూస్తే కరోనా బారిన పడే వారిలో యువత సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దానికి కారణం స్మోకింగ్ అని తేల్చి చెప్పారు పరిశోధకులు. అంతేకాదు.. ”ప్రస్తుతం 65ఏళ్లకు పైబడిన వారే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, చనిపోతున్నారు. కానీ, ఇటీవల కరోనా బారిన పడుతున్న యువత సంఖ్య, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఖ్యా పెరుగుతోంది.

మే 2 నుండి జూలై 4 వరకు చూస్తే 18 నుంచి 29 ఏళ్ల వయసున్న యువత ఆసుపత్రిలో చేరే శాతం 3 రెట్లు పెరిగింది. అదే 65 ఏళ్లు పైబడిన వారి శాతం రెట్టింపు అయ్యింది” అని స‌ర్వేలో తేలిన‌ట్లు పరిశోధకులు అంటున్నారు. అంతేకాదు..పొగాకు, సిగార్స్ తాగే అలవాటు ఉన్నవారే కాదు ఈ-సిగరెట్లు తాగే అలవాటు ఉన్నవారు కూడా ప్రమాదంలో ఉన్నట్టే అని పరిశోధకులు చెప్పారు. వీటి కారణంగా శ్వాస కోశ వ్యవస్థ దెబ్బతింటుందని, కరోనా వైరస్ దాడి చేసేందుకు అవకాశాలు పెరుగుతాయన్నారు. సో… మీరు స్మోక్ చేశారో.. ఇక ఇమ్మిల్ని క‌రోనా క‌బలించ‌డం ఖాయం .. బీ కేర్ ఫుల్..

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.