News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

17 లక్షల 60 వేలకు బాలాపూర్ లడ్డూ

ప్రతి సంవత్సరం అందరులో ఎంతో ఆసక్తిని రేకెత్తించే బాలాపూర్ లడ్డూ వేలం పాట ముగిసింది. బాలాపూర్ లడ్డూకు మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. ఈ సారి కొలన్ రామ్ రెడ్డి 17 లక్షల 60వేల రూపాయలకు బాలాపూర్ లడ్డూను వేలం పాటలో సొంతం చేసుకున్నాడు. గత సంవత్సరం కంటే ఈ సారి లక్ష రూపాయలు ఎక్కువగా పలికింది. వేలం పాటలో ఈ సారి మొత్తం 28 మంది భక్తులు పాల్గొనగా.. 17 లక్షల 60 వేల రూపాయలకు కొలన్ రామ్ రెడ్డి ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ లడ్డూను వేలం పాటలో దక్కించుకున్నాడు.

balapur laddu
గ‌త సంవత్సరం బాలాపూర్ మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా ఈ లడ్డూను 16 లక్షల 60 వేల‌కు వేలం పాటలో దక్కించుకున్నాడు. ఇక 2017లో నాగం తిరుపతి రెడ్డి  15 లక్షల 60 వేలకు సొంతం చేసుకున్నాడు. బాలాపూర్ లడ్డూ వేలం మొట్టమొదటి సారిగా 1994లో ప్రారంభమైంది. అప్పట్లో కొలను మోహన్ రెడ్డి 450 రూపాయలకు వేలం పాట పాడి లడ్డూను దక్కించుకున్నాడు. అప్పటి నుంచి బాలాపూర్ లడ్డూ వేలం బాగా పాపులర్ అయ్యింది. 450 రూపాయల నుంచి మొదలైన వేలం పాట ఈ యేడాది 17 లక్షల 60 వేల రూపాయలకు చేరడం విశేషం.

- Advertisement -

Tags: balapur, balapur laddu, balapur laddu action, balapur laddu velam, balapur laddu velam 2019, balapur laddu action 2019, balapur laddu action 17lakhs 60 thousend

Leave A Reply

Your email address will not be published.