25కోట్ల రూపాయలను పట్టుకున్న ఐటీ

news02 Dec. 3, 2018, 6:47 a.m. business

nots

ఢిల్లీ ఐటీ అధికారులు ఓ హవాలా రాకెట్‌ను ఛేదించారు. ఢిల్లీలోని చాందినీ చౌక్ నయా బజార్‌లో ఓ సెల్లార్‌లో పెద్దఎత్తున డబ్బు దాచిపెట్టినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు పక్కా పధకం ప్రకారం దాడి చేసి సెల్లార్ లోని లాకర్లను పగలగొట్టి 25 కోట్ల రూపాయల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు. సెల్లార్ లోని మొత్తం వంద లాకర్ల నుంచి 25 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ అధికారులు తెలిపారు. గుట్కా, రసాయనాలు, డ్రైఫ్రూట్స్ సహా దేశ రాజధాని పరిధిలోని పలువురు వ్యాపారులు, ప్రముఖులు ఈ డబ్బు దాచుకున్నట్టు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. సంవత్సరం ఐటీ అధికారులు నిర్వహించిన రెండో అతిపెద్ద లాకర్ ఆపరేషన్ ఇదేనని చెప్పవచ్చు. జనవరిలో ఢిల్లీలోని సౌత్ ఎక్స్‌టెన్సన్ పార్ట్2లో రహస్య లాకర్లలో దాచిన 40 కోట్ల రూపాయలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

tags: 25crores, it seazed 25 crores, it officers seazed 25 crores in delhi, 25 crores seazed in delhi

Related Post