క‌స్ట‌మ‌ర్ల‌కు బ్యాంకుల ఫైన్ల మోత‌

news02 Aug. 6, 2018, 11:44 a.m. business

sbi

న్యూఢిల్లీ: బ్యాంకులంటే భ‌రోసా. డ‌బ్బులు దాచుకోవ‌డానికి స‌రైన ఫ్లాట్ ఫాం. కానీ, ఇప్పుడు ఇవే బ్యాంకులు క‌స్ట‌మ‌ర్ల డ‌బ్బుల‌ను అడ్డ‌గోలుగా లాగేస్తున్నాయంటా..! క‌నీసం మొత్తాల‌ను త‌మ అకౌంట్ల‌లో నిల్వ ఉంచని ఖాతాదారుల‌కు అధిక మొత్తంలో ఫైన్లు వేస్తున్నాయంటా..! తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం మినిమ‌మ్ అమౌంట్‌ను ఖాతాల్లో ఉంచ‌ని ఖాతాదారుల‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది. 

banks

స‌భ‌లో విప‌క్షాలు అడిగిన ప్ర‌శ్నకు స‌మాధానం చెప్పిన కేంద్ర ప్ర‌భుత్వం... బ్యాంకులు ఈ సారి క‌నీస మొత్తాలు త‌మ ఖాతాల్లో ఉంచ‌ని క‌స్ట‌మ‌ర్ల‌కు భారీగానే ఫైన్లు వేసి త‌మ ట‌ర్నోవ‌ర్ పెంచుకున్న‌ట్లు తెలిపింది. 2017-18 వార్షిక ఏడాదికిగాను బ్యాంకులు  మినిమ‌మ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయ్య‌ని ఖాతాదారుల‌కు దాదాపు 4 వేల 988 కోట్లను ఫైన్‌గా వేసి వ‌సూల్ చేసిన‌ట్లు పేర్కోంది. ఇందులో ఎస్‌బీఐనే త‌న క‌స్ట‌మ‌ర్ల‌పై అత్య‌ధిక పెనాల్టీ భారం మోపిన‌ట్లు చెప్పింది. ఈ విష‌యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 వేల 434 కోట్ల‌తో అగ్ర‌స్థానంలో నిలిచింద‌ని తెలిపింది. ఇక త‌ర్వాత స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ 590 కోట్లు, యాక్సిస్ 530 కోట్లు, ఐసీఐసీఐ 317 కోట్లు, పీఎన్‌బీ 211 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్న‌ట్లు పేర్కోంది.

banks

సో... ఇప్ప‌టికైనా ఖాతాదారులు ఈ లెక్క‌ల చూసైనా త‌మ ఖాతాల్లో మినిమ‌మ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేస్తే బాగుంటుంది. లేక‌పోతే బ్యాంకులు పెనాల్టీల పేరుతో మ‌న ఇల్లు గుళ్ల చేయ‌డం ఖాయ‌మంటున్నారు బ్యాంకింగ్ నిపుణులు.

tags: banks,sbi,hdfc,axis,pnb,atms,minimum balance,all banks minimum balance charges,minimum balance charges in banks,banks penalties,bank penalties,penalties imposed on banks,penalties on banks foraml,penalties paid by banks,civil money penalties banks,banks act penalties,penalties against banks,banks pay penalties,penalties for banks,penalties on banks

Related Post