News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

దర్బార్ సినిమా రివ్యూ..

సినిమా.. దర్బార్
బ్యాన‌ర్‌.. లైకా ప్రొడ‌క్ష‌న్స్
తారాగణం.. ర‌జినీకాంత్‌, న‌య‌న‌తార‌, సునీల్‌శెట్టి, నివేదా థామ‌స్‌, ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్‌, యోగిబాబు, ద‌లీప్ తాహిల్‌, తంబిరామ‌య్య‌ త‌దిత‌రులు
సంగీతం.. అనిరుధ్
ద‌ర్శ‌క‌త్వం.. ఎ.ఆర్‌.మురుగ‌దాస్‌

పరిచయం…..
సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశ సినిమా పరిశ్రమలో ప‌రిచ‌యం అక్కర్లేని పేరు రజినీకాంత్. దక్షిణాది సూప‌ర్‌స్టార్‌గా రజినీకాంత్ కు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఇంతవరకు బాగానే ఉన్నా.. రజినీకాంత్ కు ఈ మ‌ధ్య ఆయన రేంజ్‌కు త‌గ్గ హిట్స్ లేవని చెప్పవచ్చు. రోబో సినిమా త‌ర్వాత రజినీకాంత్ చనాలుగైదు సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికీ ఒక్క సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. ఇదిగో ఇప్పుడు తమిళ స్టార్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జినీకాంత్ చేసిన సినిమా ద‌ర్బార్‌ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. కాహాల కాలం తర్వాత ర‌జినీకాంత్ పూర్తిస్థాయి పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించిన ఈ చిత్రం టీజ‌ర్, ట్రైల‌ర్‌ల‌తో భారీ అంచాల‌ను క్రియేట్ చేసింది. ఇంతకీ సినిమా ఎలా ఉందొ చూసేద్దామ…..

దర్బార్ క‌థ…..
ఆదిత్య అరుణాచ‌లం(ర‌జినీకాంత్‌) ,ముంబై క‌మిష‌న‌ర్ గా ఉంటూ గ్యాంగ్‌ స్ట‌ర్స్‌ అందరిని ఎన్‌కౌంట‌ర్ చేసేస్తుంటాడు.ఒక సమయంలో ఒక‌ రోజులోనే మొత్తం 13 మంది గ్యాంగ్ స్టర్స్ ను ఎన్‌కౌంట‌ర్ చేస్తాడు. ఇంకేముంది ఆదిత్య అరుణాచలం ను చూస్తే ముంబైలోని గ్యాంగ్ స్టర్స్ అంతా వనికిపోతుంటారు. ఈ క్రమంలోనే క‌థ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఆదిత్య అరుణాచలం ఢిల్లీ నుండి ముంబైకి స్పెష‌ల్ ఆర్డ‌ర్ మీద ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాడు. అంతవరకు హ‌రి చోప్రా(సునీల్ శెట్టి) కార‌ణంగా ముంబై పోలీసుల‌ను ఎవ‌రూ లెక్క‌చేయ‌రు. ప్ర‌జ‌ల్లో పోలీసులంటే ఏమాత్రం భ‌యం ఉండ‌దు. ఆదిత్య అరుణాచలం వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఇటువంటి స‌మ‌యంలోనే ఆదిత్య‌కు డిప్యూటీ చీఫ్ మినిస్ట‌ర్ కుమార్తె కిడ్నాప్ గురించి తెలుస్తుంది. ఆమెను క‌నిపెడుతూనే ముంబైలోని డ్ర‌గ్స్, హ్యుమ‌న్ ట్రాఫికింగ్ స‌మ‌స్య‌ను నిర్మూలిస్తాడు. ఆదిత్య అరుణాచలం చర్యలతో ప్ర‌జ‌ల‌కు మ‌ళ్లీ పోలీసులంటే న‌మ్మ‌కం పెరుగుతుంది. అదే స‌మ‌యంలో వినోద్ మల్హోత్రా(న‌వాబ్ షా) కొడుకు అజ‌య్ మ‌ల్హోత్రా(ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్‌) కార‌ణంగానే ముంబైలోడ‌గ్స్ రాకెట్ డెవ‌ల‌ప్ అయ్యింద‌ని తెలుస్తుంది. దీంతో అత‌న్ని అరెస్ట్ చేసి శిక్ష ప‌డేలా చేస్తాడు. దాంతో అత‌న్ని త‌ప్పించ‌డానికి వినోద్ మ‌ల్హోత్రా ఓ పథకాన్ని రచిస్తాడు. అయితే ఆ పథకాన్ని ఆదిత్య అరుణాచలం పసిగట్టేస్తాడు. అయితే వినోద్ మ‌ల్హోత్రా వేసే పథకం ఏంటి? దాన్ని ఆదిత్య అరుణాచలం ఎలా ఎదుర్కొంటాడు.. అసలు అజ‌య్‌కి హ‌రి చోప్రాకు ఉన్న సంబందమేంటి.. ఇవన్నీ తెలియాలంటే మాత్రం థియేటర్ కు వెళ్లి దర్బార్ సినిమా చూడాల్సిందే..

ఎలా ఉందంటే…..
ర‌జినీకాంత్ రోబో సినిమా త‌ర్వాత చాలా విడుద‌లైన‌ప్ప‌టికీ ఒక్క సినిమా కూడా బ్రేక్ ను ఇవ్వలేకపోయాయి. అందుకే ర‌జినీకాంత్ ఓ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ చేయాల‌నే ఉదేశ్యంతో, స్టార్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్‌తో క‌లిసి ద‌ర్బార్‌ సినిమా చేశారు. మురుగ‌దాస్ డైరెక్ట్ చేసిన గత సినిమా స్పైడ‌ర్ కూడా సక్సెస్ కాకపోవడంతో కసితో ఈ సినిమా చేశారని దర్బార్ టీజ‌ర్, ట్రైల‌ర్ చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. చాలాకాలం క్రితం పోలీస్ క్యారెక్ట‌ర్‌లో అల‌రించిన ర‌జినీకాంత్ ఇన్నాళ్లకు చేసిన పోలీస్ ఆఫీస‌ర్ సినిమా ఇది కావడంతో అందరిలో అంచనాలు పెరిగాయి. అందుకే రజినీకాంత్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని మురుగ‌దాస్ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ద‌ర్బార్ సినిమాను తెర‌కెక్కించారు.

ఎవరెలా చేశారంటే…
ర‌జినీకాంత్ సోలో పెర్ఫామెన్స్‌తో సినిమాలో అంతా తానై క‌నిపించాడు. హీరోయిన్‌గా చేసిన అందాల భామ న‌య‌న‌తార‌, కూతురుగా చేసిన నివేదా థామ‌స్ వారి వారి పాత్ర‌ల ప‌రిధి మేర బాగానే న‌టించారు. సెకండాఫ్ అంతా మెయిన్ విల‌న్ సునీల్ శెట్టి, హీరో ర‌జినీకాంత్ మ‌ధ్య‌నే ఎక్కువ భాగం సాగుతుంది. ప్ర‌తీక్ బబ్బ‌ర్‌, న‌వాజ్‌షా, యోగిబాబు ఉన్నంత‌లో కామెడీతో న‌వ్వించే ప్రయ‌త్నం చేశాడు. ర‌జినీ ల‌వ్‌ ట్రాక్‌కు ఓ రీజ‌న్ పెట్..టి దాన్ని ర‌న్ చేయ‌డంతో మ‌న‌కు ఓకే అనిపిస్తుంది. టోట‌ల్ క‌థ ప‌రంగా చూస్తే ఇదొక రివేంజ్ డ్రామా. అస‌లు ఆ ప్ర‌తీకారం ఎవ‌రు ఎవ‌రి మీద‌, ఎందుకు తీర్చుకున్నార‌నేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇక టెక్నీషియ‌న్స విష‌యానికి వ‌స్తే మురుగ‌దాస్ సూప‌ర్‌స్టార్‌ను సూప‌ర్‌మ్యాన్‌లా చూపించే ప్ర‌య‌త్నం చేసాడు.

- Advertisement -

మిగతా అంశాలు…
సినిమాలో ర‌జినీకాంత్ ఇంట్ర‌డ‌క్ష‌న్ ఫైట్ అదుర్స్ అని చెప్పవచ్చు. రజినీ అభిమానులతో పాటు.. మాస్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకునే స్టైల్లో రామ్‌ల‌క్ష్మ‌ణ్ ఫైట్‌ను డిజైన్ చేశారు. ఇక ఫైట్స్, మాస్ సీన్స్ వ‌చ్చే స‌మ‌యంలో బ్యాక్‌గ్రౌండ్ వ‌చ్చే తలైవా అనే సౌండ్ అభిమానులను అలరిస్తుంది. ఇక న‌వాజ్ షా, ప్ర‌తీక్ బబ్బ‌ర్‌, ర‌జినీకాంత్ మ‌ధ్య వచ్చే సీన్స్ బావున్నాయి. అందులో స‌న్నివేశాల ప‌రంగా కొన్ని డైలాగ్స్ ఆక‌ట్టుకుంటాయి. ర‌జినీ కాంత్ విల‌న్‌ని ఇబ్బంది పెడుతూనే సెటైరిక‌ల్‌గా మాట్లాడే స‌న్నివేశాలు బావుంటాయి. ఇక మెయిన్ విల‌న్ ఎంట్రీ ఇంట‌ర్వెల్‌లోనే ఉంటుంది. విల‌న్ వ‌చ్చిన త‌ర్వాత హీరో మీద ఎటాక్ చేసి మైండ్ గేమ్ ఆడ‌టం.. అప్పుడే ర‌జినీకాంత్ పాత్ర దాన్ని తెలివిగా ఎదుర్కొని విల‌న్‌ని ఎలా బుద్ధి చెబుతుంద‌నేదే సినిమా. ఈ అంశాల‌న్నింటినీ ఓ ప‌క్కా మెథ‌డ్‌లో మురుగ‌దాస్ సెట్ చేశాడు. ఇక సినిమాను అనిరుధ్ త‌న సంగీతంతో నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లాడు. సంతోశ్ శివ‌న్ కెమెరా ప‌నిత‌నం బావుంది. ఎడిటింగ్ బావుంది. టెక్నిక‌ల్‌గా సినిమా హై లెవెల్ లో ఉందని చెప్పవచ్చు.

చివరగా…….
సూపర్ స్టార్ ర‌జినీకాంత్‌ను ఆయ‌న అభిమానులు ఎలా చూడాల‌నుకుంటున్నారో అలా చూపించే క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌రే దర్బార్. అయితే సినిమా సెకండాఫ్ కంటే ఫ‌స్టాఫ్ బావుంది. ఫైనల్ గా రజినీకాంత్ స్టైల్ కు ఇంకాస్త కథా బలం కూడా ఉంటే సినిమా ఇంకా బాగా వచ్చేది చెప్పక తప్పడం లేదు.

న్యూస్ పిల్లర్ రేటింగ్.. 2.5/5.

Tags: Telugu Darbar, Movie public, review and rating, rajnis latest movie rating, darbar review in telugu

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.