News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఒక్క రోజు ‘ధర్మ పోరాట దీక్ష’ కు రూ.10 కోట్లా?

‘ధర్మ పోరాట దీక్ష’పై ప్రమాణపత్రం దాఖలుకు హైకోర్టు ఆదేశం…

ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరి 11న అప్పటి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన ‘ధర్మ పోరాట దీక్ష’కు రూ.10 కోట్లు ఖర్చు చేయడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒక్క రోజుకు ఇంత ఖర్చు చేయడం ఏమిటని వ్యాఖ్యానించింది. ‘ఏ నిబంధనల ప్రకారం అంత సొమ్ము విడుదల చేశారు? ఆ అధికారి ఎవరు?’ అని ప్రశ్నించింది.

- Advertisement -

ప్రజాధనం పెద్ద మొత్తంలో ఎలా ఖర్చు చేశారని, పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను నవంబరు 21కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

Tags: dharama poraata deeksha, delhi, supreme court, justices jk maheswary, justices dvss somayajulu

Leave A Reply

Your email address will not be published.