మేము హీరోలకేం తీసిపోము

news02 March 8, 2019, 7:34 p.m. entertainment

womans day

మహిళలూ.. మహారాణులు అని ఉరికే అనలేదు. ఏ రంగంలోనవైనా మహిళలు ఇప్పుడు దూసుకుపోతున్నారు. మేం ఎవరికి తీసిపోమని చాటిచెబుతున్నారు. ఇక సినిమా రంగంలో ఐతే మరీ చెప్పక్కర్లేదు. హీరోలకు ధీటుగా హీరోయిన్లు నటిస్తున్నారు. కేనవలం నటించడమే కాదు.. హీరోలతో సమానంగా మార్కెట్ చేయగలుగుతున్నారు. ఇంతవరకు మనం పలానా హీరో సినిమా ఇంత మార్కెట్ చేసిందని మాత్రమే చెప్పుకునే వాళ్లం కదా.. ఇప్పుడు ఈ కోవలోకి హీరోయిన్లు సైతం చేరిపోయారు. హీరోయిన్ల సినిమాలు సైతం ప్రపంచ మార్కెట్లో అత్యధిక వసూళ్లు సాధించి రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇందుకు కొన్ని ఉదాహారణలు చెప్పుకుంటే.. 

womans day

పద్మావత్‌ సినిమాతో వెండితెరపై మ్యాజిక్‌ చేసింది బాలీవుడ్‌ బ్యూటీ దీపిక పదుకొణె. సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమాలో దీపిక సింహళ యువరాణి రాణి పద్మావతి పాత్రలో నటించింది. 215 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని ఊహించని స్థాయిలో 585 కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డులను తిరగరాసింది. ఇక బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ క్వీన్‌ సినిమాతో నిజంగానే బాక్సాఫీస్‌ను ఏలే రాణి అయిపోయింది. కంగన నటించిన క్వీన్ 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ నటించిన నీర్జా చిత్రం సంచలన విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 119 కోట్ల వసూళ్లు రాబట్టింది.

tags: womans day, womans day special, womans day spl, deepika, sonam kapoor, bollywood records, bollywood collections

Related Post