వినయ విధేయ రామ రివ్యూ..

news02 Jan. 11, 2019, 2:07 p.m. entertainment

vinaya vidheya rama

సినిమా- వినయ విధేయ రామ

తారాగణం- రామ్‌చరణ్‌, కియారా అడ్వాణీ, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, ఆర్యన్‌రాజేష్‌, స్నేహ, మధుమిత, రవి వర్మ, హిమజ, హరీష్‌ ఉత్తమన్‌, మహేష్‌ మంజ్రేకర్‌ తదితరులు

మ్యూజిక్ - దేవి శ్రీ ప్రసాద్‌

నిర్మాత- డీవీవీ దానయ్య

దర్శకత్వం- బోయపాటి శ్రీను

న్యూస్ పిల్లర్ రేటింగ్- 2.5/5

పరిచయం.........

బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. రవితేజ భధ్ర సినిమా నుంచి మొదలు మొన్నటి జయ జావకీ నాయక వరకు ఆయన సినిమాల్లో మాస్ హీరోయిజం కన్పిస్తుంది. బో.పాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ దాదాపు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక మెగా హీరో రాంచరణ్ సైతం మొన్నే రంగస్థలం తో మంచి హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు బోయపాటి- రాంచరణ్ కాంబినేషన్ లో వస్తున్న వినయ విధేయ రామ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఇంతకీ వినయ విధేయ రామ సినిమా ఎలా ఉండబోతోందో చూసేద్దామా.....

vinaya vedheya rama

వినయ విధేయ రామ కధ..........

మొత్తం ఐదుగురు అన్నదమ్ములు ఉన్న (ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేష్‌, మ‌ధునంద‌న్‌, ర‌వివ‌ర్మ‌) అందమైన కుటుంబంలోఅందరి కన్నా చిన్నవాడు రామ్ కొణిదెల (రామ్‌ చరణ్). ఇంట్లో చిన్నవాడు కాబట్టి రామ్ అంటే అంద‌రికీ ఎంతో ఇష్టం. అలాగే తన ఫ్యామిలీ అంటే రామ్ ప్రాణం అన్న మాట. రామ్ పెద్ద‌న్న (ప్ర‌శాంత్‌) విశాఖపట్నం ఎన్నికల కమీషనర్‌గా ప‌నిచేస్తుంటాడు. ఈ క్రమంలో విశాఖపట్నంలో జరిగే ఉప ఎన్నిక‌ల్లో పందెం పరశురాం(ముఖేష్ రుషి) అరాచ‌కాల‌ను రామ్ పెద్ద‌న్న వెలికితీస్తాడు. దీంతో వారిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతుంది. దీంతో ప్రశాంత్ పై పగ పెంచుకున్న పరశురాం.. రామ్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. రామ్ కుటుంబాన్ని నాశనం చేసేందుకు బిహార్‌లో ఉన్న మున్నాభాయ్‌(వివేక్ ఒబెరాయ్‌) రప్పిస్తాడు. ఇక్కడే అసలు కధ మొదలవుతుంది. మరి మున్నబాయ్ రామ్ కుటుంబాన్ని ఎలా టార్గెట్ చేశాడు.. రామ్ అతన్ని ఎలా ఎదుర్కొన్నాడు.. అన్నది చూడాలంటే మాత్రం వినయ విధేయ రామ సినిమా ధియోటర్ లో చూడాల్సిందే.

ఎలా ఉందో తెలుసా...............

వినయ విధేయ రామ సినిమా రెండు వెర్షన్స్ లో మనకు కన్పిస్తుంది. పూర్తి కుటుంబ కధా చిత్రంగా ఓవైపు.. మరో వైపు కుటుంబాన్ని కాపాడుకునే యాక్షన్ ధ్రిల్లర్ మరోవైపు కన్పిస్తాయి. డైరెక్టర్ బోయ‌పాటి సినిమాల్లో స‌హ‌జంగా యాక్ష‌న్ మోతాదుతో పాటు.. కుటుంబ బంధాలు, అనుబంధాల‌ు సైతం సమపాళ్లలో ఉంటాయి. ఈసినిమాలో కూడా అదే ఫార్ములాను బోయపాటి ఎంచుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా వినయ విధేయ రామలో ఇవి రెండూ కాస్త ఎక్కువయ్యాయని చెప్పవచ్చు. ఓ ఫ్యామిలో అన్నావ‌దిన‌లు, వారి పిల్ల‌ల మ‌ధ్య ఎలాంటి వాతావ‌ర‌ణం ఉంటుందో అదంతా తెర‌పై చాలా అందంగా, సరదాగా చూపించాడు. సినిమాలోని ప్ర‌తి ఫ్రేమ్‌లోనూ ప‌ది, ప‌దిహేను మంది క‌న‌ప‌డి సందడి చేస్తారు. అందాల భామ కియారా అడ్వాణీతో కొన్ని స‌న్నివేశాలు, ఆఫీస్‌లో జ‌రిగే ఎపిసోడ్ల‌లో కాస్త ఎంటర్ టైన్ మెంట్ అల‌రిస్తుంది. ఐతే ప్రతి సందర్బంలోను వచ్చే యాక్ష‌న్ ఎపిసోడ్లతో క‌థ బాగా చితికిపోయిందని చెప్పవచ్చు. హీరోయిజం ఎలివేట్ చేసే స‌న్నివేశాలు ప‌తాక స్థాయిలో ఉంటాయి. కొన్ని సందర్బాల్లో యాక్ష‌న్ సీక్వెన్స్ ముందు వ‌చ్చే స‌న్నివేశాల్లో భావోద్వేగాలు బాగా పండించాడని చెప్పవచ్చు.

vinaya vedheya rama

ఇక ఇంటర్వెల్ తరువాత హీరో రామ్‌.. విలన్ మున్నాభాయ్‌ల మధ్య యాక్షన్ సన్నివేశాలే ఎక్కువ. సెకండ్ హాఫ్ లో ఒక‌దాని త‌ర్వాత మ‌రొక‌టి వ‌రుస‌గా యాక్ష‌న్ సన్నివేశాలే అని చెప్పవచ్చు. దీంతో యాక్షన్ సన్నివేశాల మోతాదు కాస్త ఎక్కువైందేమో అనిపిస్తుంది. ఫైట్ అవ్వగానే అరే మ‌ళ్లీ ఫైట్ వ‌చ్చేసిందే అన్న ఫీలింగ్ ప్రేక్ష‌కుడికి కలుగుతుంది. కేవలం యాక్ష‌న్ కోస‌మే యాక్ష‌న్ అన్న‌ట్లు సెకండాఫ్ సాగి కాస్త బోర్ కొడుతుంది. అంతకు ముంది క‌నిపించే ఫ్యామిలీ డ్రామా, ఎమోష‌న్స్‌, ల‌వ్ సీన్లు, ఫ‌న్ ఇవేవీ సెకండ్ హాఫ్ లో ఏ మాత్రం క‌నిపించ‌వు. డైరెక్టర్ బోయపాటి గతంలోని సినిమాలన్నీ కలిపి ఈ సినిమా తీశారేమో అని ఓ సందర్బంలో అనిపిస్తుంది.

అంతా ఇలా చేశారు...

మొన్న విలేజ్ బ్యాక్ డ్రాప్ లోరంగస్థలం సినిమా తరువాత పూర్తి యాక్షన్ ఎపిసోడ్ సినిమా చేశాడు రాంచరణ్. రామ్ పాత్ర‌లో చాలా షేడ్స్ ఉంటాయి. ఫ్యామిలీ డ్రామా, ల‌వ్‌, ఫ‌న్‌, ఒక ఫైట‌ర్ ఇలా అనేక షేడ్స్ లో రాంచరణ్ కన్పిస్తాడు. అన్నింటిక‌న్నా యాక్షన్ సన్నివేశాల్లో రాంచరణ్ బాగా ఎలివేట్ అయ్యాడు. సిక్స్‌ప్యాక్ చేసి రామ్ చేసిన యాక్ష‌న్ స‌న్నివేశాలు అభిమానుల‌కు బాగా ఆకట్టుకుంటాయి. అందాల భామ కియారా అడ్వాణీ చాలా అందంగా క‌నిపించింది. సినిమాలో ఆమె పాత్ర‌కు అంత‌గా ప్రాధాన్యం లేదు. అన్న‌ద‌మ్ములుగా న‌టించిన ప్ర‌శాంత్‌, ఆర్య‌న్‌రాజేష్‌, మ‌ధునంద‌న్‌, ర‌వివ‌ర్మ‌లు తమ పాత్ర‌ల‌్లో ఒదిగిపోయారని చెప్పవచ్చు. అందరికంటే ప్ర‌శాంత్‌కు బాగా నటించారని చెప్పవచ్చు. ఆర్య‌న్ రాజేష్ కూడా బాగానే నటించాడు. ఇక విలన్ పాత్ర‌లో న‌టించిన వివేక్ ఒబెరాయ్ త‌న‌దైన శైలిలో ఆకట్టుకున్నాడు. రామ్‌-వివేక్ పోరాట స‌న్నివేశాలు అబ్బురపరుస్తాయి. మొత్తానికి యాక్షన్ సన్నివేశాల కోసం మాత్రమే వినయ విధేయ రామ సినిమాకు వెళ్లాలని చెప్పవచ్చు.

గమనిక- ఇకి కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

tags: vinaya vedheya rama, vinaya vidheya rama review, vinaya vidheya rama movie review, vinaya vidheya rama rating, vinaya vidheya rama film, vinaya vidheya rama film review, vinaya vidheya rama exclusive review

Related Post