అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం

news02 June 16, 2019, 7:33 p.m. entertainment

vishal

ఇప్పుడు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో శరత్ కుమార్ ఫ్యామిలీ వర్సెస్ విశాల్ నడుస్తోంది. తమిళ నటీనటుల సంఘం నడిగర్ ఎన్నికల నేపధ్యంలో వారి మధ్య మాటల యుధ్దం నడుస్తోంది. సీనియర్ నటుడు శరత్‌ కుమార్‌ను ఘాటుగా విమర్శిస్తూ ఓ వీడియో విడుదల చేశారు విశాల్‌. దీనిపై ఆయన కూతురు.. నటి వరలక్ష్మి తీవ్రంగా విరుచుకుపడింది. తన తండ్రి ఈ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ ఆయనపై ఇంత కక్ష సాధింపు చర్యలు ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా విశాల్‌పై ఉన్న నమ్మకం ఇక్కడితో పోయిందని, తన ఓటును కూడా విశాల్‌ కోల్పోయాడని వరలక్ష్మి ఘాటుగా స్పందించింది.  ఎన్నికల్లో గెలవడం కోసం హీరో విశాల్ దిగజారి మాట్లాడుతున్నాడని వ్యాఖ్యాలు చేసింది. 
varalaxmi
దీంతో తనపై నటి వరలక్ష్మి చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయమని విశాల్‌ వ్యాఖ్యానించాడు. ఐతే వీరిద్దరూ గతంలో ప్రేమాయణం సాగించారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగానే విశాల్, వరలక్ష్మి ప్రేమ పక్షుల్లానే తిరిగారు. ఇక ఇటీవలే విశాల్‌కు హైదరాబాద్ కు చెందిన అనీశా రెడ్డితో నిశ్చితార్థం అయింది. అటు శరత్ కుమార్ సతీమణి.. సీనియర్ నటి రాధిక కూడా విశాల్ పై తీవ్రస్థాయిలో మండిపడిండి. శరత్‌కుమార్‌ సంఘంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన విశాల్.. ఇప్పటి వరకు నిరూపించలేకపోయాడని చెప్పింది. అంతే కాదు ఏ మాత్రం సిగ్గులేకుండా ఇంకా అవే మాటలు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యింది. మరి ఈ విషయం ఎక్కడిదాకా వెళ్తుందన్నదే ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో ఆసక్తి రేపుతోంది.

varalaxmi

tags: vishal, varalaxmi, varalaxmi vs vishal, vishal vs varalaxmi, vishal about varalaxmi, varalaxmi about vishal, varalaxmi fire on vishal, radhika fire on vishal

Related Post