దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది

news02 March 12, 2019, 8:14 p.m. entertainment

rashmi

హాట్ యాంకర్ రష్మి గౌతమ్‌కు సోషల్‌మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుందని అందరికి తెలిసిందే. అభిమానులు అడిగే ప్రశ్నలకు రష్మి ఎప్పటికప్పుడు దీటుగా సమాధానాలు ఇస్తుంటుంది. మొన్న రష్మికి సోషల్ మీడియాలో ఓ వ్యక్తి నుంచి అనుకోని ప్రశ్న ఎదురైంది. ఓ నెటిజన్‌ రష్మిని తండ్రి ఫోన్ నెంబర్‌ కావాలని అడిగాడు. ఓ యాడ్‌ ఫిలమ్ షూటింగ్ కోసం మిమ్మల్ని సంప్రదించాలని అనుకుంటున్నానని చెప్పిన నెటిజన్.. మీ నాన్న నెంబర్‌ నాదగ్గర ఉండేది కాని అది పోయిందని... ఏమీ అనుకోకపోతే నాకు మీ నాన్న నెంబర్‌ను ఇవ్వండని అడిగాడు.

rashmi

ఐతే రష్మీకి ఏ మాత్రం అనుమానం రాకుండా తన ట్విటర్‌ ఖాతాకు పీఆర్‌ మేనేజ్‌మెంట్‌ అని పేరు కూడా పెట్టుకున్నాడు. దీనికి స్పందించిన రష్మీ.. నాకు పన్నెండేళ్ల వయసున్నప్పుడే మా నాన్న చనిపోయారు. కాబట్టి మా నాన్న నెంబర్‌ నీ దగ్గర ఉండే అవకాశమే లేదని చెప్పింది. ఇలా పీఆర్‌ మేనేజ్‌మెంట్ పేరుతో ఇతరులను ఫూల్‌ చేయాలని ప్రయత్నించకని సదరు నెటిజన్ ను హెచ్చరించింది. అమ్మాయిలతో మాట్లాడటానికి ఇదో కొత్త వంక అన్న రష్మీ.. మీలాంటి వారి వల్లే సినిమా ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తోందని ఘాటుగా సమాధానం చెప్పింది. దీంతో ఖంగు తినడం ఆ నెటిజన్ వంతైంది. మరి రష్మీనా మజాకా.

tags: rashmi, rashmi goutham, rashmi hot, rashmi about fans, rashmi answers to fans, rashmi shokin answer, rashmi latest

Related Post